కోడిగుడ్డును సంపూర్ణఆహారంగా చెబుతారు. ఒక గుడ్డు తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఒకేసారి అందుతాయి. అందుకే రోజుకో గుడ్డు తినమని సిఫారసు చేస్తున్నాయి అధ్యయనాలు. నలభై ఏళ్లు వయసు దాటిన చాలా మంది గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుందని చెబుతూ తినడం మానేస్తున్నారు. కానీ ఆరోగ్యకరమైన జీవితానికి సమతుల్య ఆహారం చాలా అవసరం. అందుకు కోడిగుడ్డు తినడం కూడా ముఖ్యం. కండరాలకు బలాన్ని చేకూర్చడంలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి. అందుకే నలభై ఏళ్లు దాటిన వారు కచ్చితంగా రోజుకో గుడ్డు తినమని చెబుతున్నారు ఆహారనిపుణులు. వారానికి ఏడు గుడ్లకు తక్కువ కాకుండా తినమంటున్నారు. 

Continues below advertisement


ఒక ఉడికించిన గుడ్డులో
కేలరీలు - 77
కార్బో హైడ్రేట్లు  0.6 గ్రాములు
కొవ్వు - 5.3 గ్రాములు
కొలెస్ట్రాల్ - 212 మైక్రోగ్రాములు
ప్రోటీన్ - 6.3 గ్రాములు
విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ బి12, విటమిన్ బి5, ఫాస్పరస్, సెలీనియం, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవన్నీ మన శరీరం సక్రమంగా పనిచేయడానికి అవసరమైనవే. 


40 ఏళ్లు దాటిన వారు తింటే...
నలభై ఏళ్లు దాటక కండరాలు క్షిణిస్తుంటాయి. వాటిని మళ్లీ బలంగా చేసేందుకు గుడ్డు చాలా సహకరిస్తుంది. ఆ వయసు దాటిని వారికి గుడ్డు మంచి పోషకాహారం. శరీరానికి అవసరమైనంత ప్రోటీన్‌ను ఇది అందిస్తుంది. ఈ ప్రోటీన్ సులభంగా జీర్ణమవుతుంది కూడా. గుడ్డులో లూసిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది కండరాల పటుత్వానికి అవసరం. కండరాలు వదులయ్యాయో మీకు పనులు చేయడం కష్టమవుతుంది. విటమిన్ డి, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా స్వల్ప మొత్తంలో లభిస్తాయి. 


గుడ్డులోని కొలెస్ట్రాల్ మంచిదే 
గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుందని తినడం మానేస్తే మీకే నష్టం. ఇందులో కొలెస్ట్రాల్ మితంగానే ఉంటుంది. అందులోను అది మంచి కొలెస్ట్రాల్, మన శరీరానికి అవసరమైనదే. కాబట్టి బరువు పెరుగుతామన్న బెంగ మానేసి రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డు తినేందుకు ప్రయత్నించండి. 40 ఏళ్లు దాటినవారికి పోషకాల అవసరం పెరుగుతుంది. ఆ లోటును తీర్చగలిగేది గుడ్డు మాత్రమే.   


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: ఉప్పుతో బీపీయే కాదు మధుమేహం కూడా వచ్చే అవకాశం, వెల్లడించిన కొత్త అధ్యయనం


Also read: ప్రతి చిన్నవిషయానికి కోపం వస్తుందా? వీటిని రోజూ తినండి కంట్రోల్‌లో ఉంటుంది