దేశంలో కరోనా విజృంభణ స్థిరంగా కొనసాగుతుంది. కొత్తగా 40,134 కొవిడ్19 కేసులు నమోదవగా, మరో 422 మంది కరోనా మహమ్మారితో మరణించారు.
- మొత్తం కేసులు: 3,16,95,958
- మొత్తం రికవరీలు: 3,08,57,467
- మొత్తం మరణాలు: 4,24,773
- యాక్టివ్ కేసులు: 4,13,718
- వ్యాక్సినేషన్: 47,22,23,639 (గత 24 గంటల్లో 17,06,598 )
2021 ఆగస్టు 1 వరకు దేశవ్యాప్తంగా 46,96,45,494 కరోనా శాంపిల్స్ ను టెస్ట్ చేసినట్లు భారత వైద్య, పరిశోధన మండలి వెల్లడించింది. నిన్న 14,28,984 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.
భువనేశ్వర్ రికార్డ్..
దేశంలో 100 శాతం కరోనా వ్యాక్సినేషన్ చేపట్టిన నగరంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్ రికార్డ్ సృష్టించింది. ఈ మేరకు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సౌత్ ఈస్ట్ జోనల్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
"నిర్దిష్ట సమయంలోగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని మేము లక్ష్యంగా పెటుకున్నాం. భువనేశ్వర్ నగరంలో 18 ఏళ్లు పైన వారు దాదాపు 9 లక్షల మంది ఉన్నారు. ఇందులో 31 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు, 33 వేల మంది ఫ్రంట్ లైన్ ఉద్యోగులు, 18 నుంచి 44 ఏళ్ల మధ్య 5 లక్షల 17 వేల మంది, 45 ఏళ్లు పైబడిన వారు 3 లక్షల 25 వేల మంది ఉన్నారు. జులై 31 లోగా వీరందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
ALSO READ: US Covid 19: వ్యాక్సిన్ వేసుకున్నా మాస్క్ అవసరమా? అమెరికాలో ఏం చేస్తున్నారు?
నిర్దిష్ట సమయంలోగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని మేము లక్ష్యంగా పెటుకున్నాం. భువనేశ్వర్ నగరంలో 18 ఏళ్లు పైబడిన వారు దాదాపు 9 లక్షల మంది ఉన్నారు. ఇందులో 31 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు, 33 వేల మంది ఫ్రంట్ లైన్ ఉద్యోగులు, 18 నుంచి 44 ఏళ్ల మధ్య 5 లక్షల 17 వేల మంది, 45 ఏళ్లు పైబడిన వారు 3 లక్షల 25 వేల మంది ఉన్నారు. జులై 31 లోగా వీరందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 18 లక్షల 16 వేల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. వివిధ కారణాల వల్ల కొంత మంది మాత్రమే ఫస్ట్ డోస్ తీసుకోలేకపోయారు. చాలా మంది వలస కూలీలు కూడా భువనేశ్వర్ లో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు."
- అన్షుమాన్ రాత్, బీఎమ్ సీ సౌత్ ఈస్ట్ జోనల్ డిప్యూటీ కమిషనర్
దేశంలో థర్డ్ వేవ్ ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటివారం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ఈ లోపు వీలైనంత మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి.
ALSO READ: India Modi: ఏ ప్రధానికీ దక్కని అరుదైన ఘనత.. మరోసారి హాట్ టాపిక్‌గా ప్రధాని మోడీ