ABP  WhatsApp

Covid Scare in Parliament: బడ్జెట్ సమావేశాలపై కరోనా పడగ.. 403 మంది పార్లమెంటు సిబ్బందికి కొవిడ్

ABP Desam Updated at: 09 Jan 2022 12:24 PM (IST)
Edited By: Murali Krishna

403 మంది పార్లమెంటు సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో బడ్జెట్ సమావేశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి.

బడ్జెట్ సమావేశాలకు కరోనా షాక్

NEXT PREV

బడ్జెట్ సమావేశాలకు ముందు షాక్ తగిలింది. 400 మందికి పైగా పార్లమెంటు సిబ్బందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు అధికారుల సమాచారం. 1,409 మంది పార్లమెంటు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 402 మందికి కొవిడ్ నిర్ధరణైంది.







జనవరి 4 నుంచి 8 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఎంతమందికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అవుతుందోనని అధికారులు భయపడుతున్నారు. 



402 మంది సిబ్బంది వరకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. జనవరి 4- 8 వరకు ఈ పరీక్షలు చేశాం. ఈ శాంపిళ్లను ఒమిక్రాన్ నిర్ధారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాం.  పాజిటివ్‌గా వచ్చిన కేసుల్లో 200 మంది లోక్‌సభ, 69 మంది రాజ్యసభ సిబ్బంది కాగా మరో 133 మంది అదనపు సిబ్బంది.                                                       - అధికారులు


పార్లమెంటు సిబ్బందిలో ఎక్కువ మంది కరోనా బారిన పడటంతో కొవిడ్ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే పాజిటివ్ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నవారు ఐసోలేషన్‌లో ఉన్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రతి ఏడాది జనవరి చివరి వారంలో మొదలవుతాయి.


కరోనా వ్యాప్తి..







దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 1,59,632 మందికి కరోనా సోకింది. 327 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Also Read: PM Modi Meeting: కొవిడ్‌ పరిస్థితులపై ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమీక్ష.. లాక్‌డౌన్‌ తప్పదా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 09 Jan 2022 12:24 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.