దేశంలో వరుసగా రెండు రోజులు నుంచి కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కొత్తగా 35,499 కేసులు నమోదవగా 447 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 4,02,188గా ఉంది. రికవరీ రేటు 97.40%కి చేరింది.
వీక్లీ పాజిటివ్ రేటు 5 శాతానికి తక్కువే ఉంది. ప్రస్తుతం 2.35%గా ఉంది. డైలీ పాజిటివ్ రేటు 2.59%కి చేరింది. గత 14 రోజులుగా డైలీ పాజిటివ్ రేటు 3 శాతానికి తక్కువే ఉంది.
మొత్తం మరణాల సంఖ్య 4,28,309కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కేరళలో మాస్ వ్యాక్సినేషన్..
కేరళలో కొత్తగా 18,607 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 35,52,525కి చేరింది. కొత్తగా 93 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 17,747కి పెరిగింది.
తాజాగా 1,34,196 మందికి పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ రేటు (టీపీఆర్) 13.87 శాతంగా ఉంది.
20,108 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 33,57,687కి పెరిగింది.
మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,76,572కి పెరిగింది.
కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టింది ప్రభుత్వం. ఆగస్టు 31 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. వీలైనంత మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
మహారాష్ట్రలో 45 డెల్టా కేసులు..
ఆగస్టు 8 వరకు మహారాష్ట్రలో 45 డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 5,508 కరోనా కేసులు నమోదుకాగా 151 మంది మరణించారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 63,53,327కి చేరగా మృతుల సంఖ్య 1,33,996 వద్ద ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
4,895 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 61,44,388కి పెరిగింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 71,510 వద్ద ఉంది.
రికవరీ రేటు 96.71%గా ఉంది. మరణాల రేటు 2.1%.గా ఉంది.