Covid New Variant JN1 New Symptoms: కరోనా కొత్త వేరియంట్‌ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే పలు ఐరోపా దేశాలను ఈ కొత్త వేరియంట్‌ భయపెడుతోంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (WHO) ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. ఒమిక్రాన్‌ ఉప వేరియంటైన దీన్నీ WHO ‘వేరియంట్‌ ఆఫ్ ఇంట్రెస్ట్’గా గుర్తించింది. ఈ వైరస్ వల్ల చాలామంది మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తాజా పరిశోధనలో తేలింది.


కరోనా ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌ Jn1 వ్యాప్తి.. ప్రంపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తుంది. ఇప్పటికే ఇండియా, చైనా, యూకే, యూఎస్ఏతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ వేరియంట్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. 2020లో వచ్చిన కరోనా వైరస్ కంటే చాలా భిన్నంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త వైరస్ వ్యక్తి నుంచి వ్యక్తికి చాలా వేగంగా సోకుతోందని.. ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని WHO పేర్కొంది. యూకే ప్రభుత్వం విడుదల చేసిన తాజా నివేదికల ప్రకారం.. కోవిడ్‌తో బాధపడుతున్న బ్రిటీషర్లలలో దాదాపు 10 శాతం మంది నవంబర్ నుంచి ఆందోళన, నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు.


ముక్కు కారడం, దగ్గు.. రుచి, వాసన కోల్పోవడం వంటివి JN.1 వేరియంట్‌ ఇన్ఫెక్షన్ సాధారణ లక్షణాలు. సుమారు 31 శాతం మంది రోగులు ఈ లక్షణాలను కలిగి ఉన్నట్లు నివేదికల్లో పేర్కొన్నారు. కొంతమంది బాధితులు జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. అయితే, ఈ లక్షణాలతో కేవలం రెండు శాతం మంది మాత్రమే ఉన్నారని, కానీ 23 శాతం మంది ప్రజలు దగ్గుతో బాధపడుతున్నారని, మరో 20 శాతం మంది తలనొప్పిని ఎదుర్కొంటున్నట్లు నివేదించారు. అలాగే 20 శాతం మంది బలహీనత, అలసటతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. మరో 16 శాతం మంది కండరాల నొప్పులను ఎదుర్కొంటున్నట్లు నివేదికలో వెల్లడించారు. మరో 13 శాతం మంది గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు.


రోగనిరోధక శక్తి క్షీణిస్తోంది


కొత్త వేరియంట్‌ సోకిన వ్యక్తుల్లో చాలా స్పీడుగా రోగనిరోధక శక్తి క్షీణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. వ్యాక్సిన్‌లు , సహజ రోగనిరోధక శక్తి అయిన యాంటీబాడీలు కూడా కొన్ని సార్లు వైరస్‌ను నిరోధించడంలో విఫలం అవుతున్నాయని.. వైరస్ ఎంత ఎక్కువగా మారితే.. దానితో పోరాడడంలో తక్కువ ప్రభావవంతమైన యాంటీబాడీలు ఉంటాయంటున్నారు. 2020 కంటే ఇప్పుడు వచ్చిన కోవిడ్ కొత్త వేరియంట్‌ తక్కువ వైరస్ లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ ఇది చాలా ప్రమాదకరమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌ సోకిన వారిలో ఇన్ఫెక్షన్‌లు కూడా తక్కువగా ఉంటాయని, అలాగని నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం అంటున్నారు. కోవిడ్‌తో పాటు, ఈ శీతాకాలంలో అనారోగ్యానికి గురిచేసే అనేక ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్‌లు కూడా వస్తుంటాయని.. అన్ని వైరస్‌లు కోవిడ్‌ లు కాదని నిపుణులు అంటున్నారు.



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read : కరకరలాడే పెసర పునుగులు.. తయారు చేయడం ఇంత తేలికా అనిపించే రెసిపీ ఇదే