దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 30,773 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన వాటితో కలిపి దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,34,48,163కి చేరింది. నిన్న ఒక్క రోజే కోవిడ్ బాధితుల్లో 309 మంది మరణించారు. దీంతో కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,44,838కి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 38,945 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 3,26,71,167కి చేరింది.


దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3,32,158 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో నిన్న నమోదైన కోవిడ్ కేసుల్లో అత్యధికం కేరళ నుంచే ఉన్నాయి. కేరళలో గత 24 గంటల్లో 19,325 మందికి కోవిడ్ పాజిటివ్ రాగా.. 143 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ రికవరీ రేటు 97.68 శాతంగా ఉంది. నిన్న 15,59,895 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 55,23,40,168 మంది శాంపిళ్లను పరీక్షించారు. 


11 రోజుల్లో 10 కోట్ల వ్యాక్సిన్లు..
దేశవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్ ప్రక్రియ జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోంది. దేశంలో ఇప్పటివరకు అందించిన టీకా డోసుల సంఖ్య 80 కోట్ల మైలురాయిని దాటిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్నటి వరకు మొత్తం 80,43,72,331 మందికి వ్యాక్సిన్లు అందించినట్లు తెలిపింది. నిన్న ఒక్క రోజే 85,42,732 మందికి టీకాలు వేసినట్లు తెలిపింది. కేవలం 11 రోజుల్లో 10 కోట్ల మందికి కోవిడ్ టీకాలు అందించినట్లు పేర్కొంది. 






Also Read: 11 రాష్ట్రాల్లో సెరో టైప్-2 డెంగ్యూ కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖ సమావేశం.. జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా..


Also Read: Rajasthna Crime News: రాజస్థాన్ లో దారుణ ఘటన... నలుగురు కుమార్తెలను హత్యచేసిన తండ్రి...