కరోనా వైరస్ సోకిన వారికి ఐసోలేషన్ నిబంధనల్లో కేంద్రం మార్పులు చేసింది. హోం ఐసోలేషన్ లో ఉంటున్న పేషెంట్లకు కొత్త మార్గదర్శకాలు వర్తిస్తాయి. కరోనా పాజిటివ్‌గా తేలి లక్షణాలు లేని వారు.. తక్కువగా ఉన్నవారు.. వరసగా మూడు రోజులు జ్వరం రాకపోతే కేవలం 7 రోజుల ఐసోలేషన్ ఉంటే సరిపోతుంది. కోవిడ్ వచ్చిన వారు ట్రిపుల్ లేయర్ మాస్క్ లను ధరించాలని, వెంటిలేషన్ బాగా ఉండే రూంలో ఐసోలేట్ అవ్వాలని కేంద్రం సూచించింది.
Also Read: భయపడకండి.. బూస్టర్ డోస్ వచ్చేసింది.. చుక్కల మందుకు డీసీజీఐ అనుమతి!
ఈ వారం రోజులు ఇతరులతో ఎటువంటి కాంటాక్ట్ లేకుండా చూసుకోవాలని కేంద్రం కోరింది. హోం ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. హెచ్ఐవీ, అవయవాలు ట్రాన్స్‌ప్లాంట్ , క్యాన్సర్ థెరపీ వంటి సీరియస్ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రం లక్షణాలు ఉన్నా లేకపోయినా ఆస్పత్రిలో చేరాలని కేంద్రం సూచిస్తోంది. అలాగే హైగ్రేడ్ ఫివర్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. ఆక్సిజన్ శాతం 93 కన్నా తక్కువగా ఉండేవారికి ఖచ్చితంగా మెడికల్ సపోర్ట్ అవసరమని కేంద్రం స్పష్టం చేసింది.
హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు ఎప్పటికప్పుడు పల్స్ రేట్ చెక్ చేసుకోవాలి. కుటుంబసభ్యులు ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి దగ్గరకు రావాల్సి వస్తే.. ఇద్దరూ ఎన్ 95 మాస్క్‌ను ఉపయోగించాలి. బాధితులు వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలుచేసింది. రోజుకు మూడు సార్లు వేడి నీటితో గార్గిల్ చేసుకోవడం, ఆవిరి పట్టడం వంటివి చేయాలి. ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో కరోనా బాధితులు ఉపయోగించే వస్తువులను ఇతరులు ఉపయోగించకూడదు.
Also Read: Bengal Team Covid Positive: శివమ్ దూబె, బెంగాల్ రంజీ క్రికెటర్లలో ఏడుగురికి కరోనా
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభణ కొనసాగుతోంది. కరోనాకు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తోడవడంతో కేసుల సంఖ్య క్రమంగా పెరగుతోంది. గత కొన్ని రోజుల దాకా రోజూవారీ కేసులు 50 వేల వరకూ నమోదువుతున్నాయి. ఒమిక్రాన్ కేసులూ పెరుగుతున్నాయి. అయితే ఎక్కువగా సీరియస్ కావడం లేదు. దీంతో ఏడు రోజులు మాత్రమే ఐసోలేషన్‌కు తగ్గించినట్లుగా తెలుస్తోంది.
Also Read: Lionel Messi Covid Positive: మెస్సీకి కరోనా.. మరో ఇద్దరికి కూడా!