కోవిడ్-19కు మందులేదనే సంగతి తెలిసిందే. అది రాకుండా జాగ్రత్త పడటం ఒక్కటే మార్గం. వ్యాక్సిన్ తీసుకున్నామనే ధీమా కూడా పనిచేయదు. ఎందుకంటే.. ఎప్పుడో మూడు, నాలుగు నెలల కిందట తీసుకున్న వ్యాక్సిన్ల ప్రభావం కూడా తగ్గిపోతోంది. ఇలాంటి సమయంలో కరోనా సోకితే.. మళ్లీ నరకయాతన. అయితే, వైద్యులు.. కరోనాను ఎదుర్కొనే ఔషదం కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో యూకే వైద్యులు ఓ మహిళపై చేసిన ప్రయోగం చర్చనీయమైంది. 


మోనికా అల్మేదా అనే 37 ఏళ్ల మహిళ.. గతేడాది అక్టోబర్ నెలలో కోవిడ్-19కు గురైంది. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో నవంబరు 9న హాస్పిటల్‌లో చేర్చారు. వైరస్ వల్ల ఆమె రుచి, వాసన చూడలేకపోయింది. రక్తపు వాంతులయ్యాయి. ఆమె ఆక్సిజన్ స్థాయి కూడా బాగా పడిపోయింది. ఆమె పరిస్థితి మరింత దయనీయంగా మారడంతో లింకన్ కౌంటీ హాస్పిటల్‌లో చేర్చారు. నవంబరు 16వ తేదీన ఆమెను కోమాలోకి పంపారు. అప్పటి నుంచి ఆమెపై అనేక రకాల ప్రయోగాలు చేశారు. చివరికి వైద్యులు.. పురుషులు సెక్స్ స్టామినా కోసం ఉపయోగించే ‘వయాగ్రా’ను అధికమోతాదులో ఇచ్చారు. అంతే.. దెబ్బకు కోమా నుంచి మేల్కొంది. అయితే, ఆమె కరోనా వల్ల కోమాలోకి వెళ్లలేదు. వైద్యులే ఆమెను కోమాలకు పంపించి ఈ ప్రయోగం చేశారు. ఆమెను కోమాలోకి పంపడానికి ముందే వైద్యులు.. అల్మేదాతో సంతకాలు పెట్టించుకున్నారు. ఆ తర్వాతే ఈ ప్రయోగం చేశారు. 


Also Read: దేశీయులు మహా రసికులు.. ఒక్కొక్కరూ 14 మందితో సెక్స్.. మనోళ్లు వెనుకబడ్డారే!


వయాగ్రా ఇచ్చిన తర్వాత ఆమెలో కదలికలు కనిపించాయి. ఊపిరి కూడా తనంతట తానే పీల్చుకోవడం మొదలుపెట్టింది. దీంతో వైద్యులు వెంటిలేటర్‌ను తొలగించారు. వయాగ్రా వల్లే ఆమె తిరిగి కోలుకుందనే విషయం తెలిసి అల్మేదా ఆశ్చర్యపోయింది. ‘‘నన్ను వయాగ్రానే కాపాడింది. మొదట్లో నేను వయాగ్రా వల్లే కోలుకున్నా అని చెప్పగానే జోక్ అనుకున్నా. అది నిజమేనని తెలిశాక చాలా ఆశ్చర్యపోయా. కోమా నుంచి మేల్కొన్న 48 గంటల్లోనే నా శ్వాసకోస వ్యవస్థ మెరుగైంది. వయాగ్రా వల్ల రక్త నాళాలు విస్తరిస్తాయి. నాకు ఉబ్బసం కూడా ఉంది. ఆ ట్రీట్మెంట్ తర్వాత ఊపిరి పీల్చుకోవడం కూడా సులభమైంది’’ అని తెలిపింది. 


Also Read: యాసిడ్ దాడి చేసిన వ్యక్తినే ప్రేమించి పెళ్లాడిన యువతి, చివరికి ఊహించని ట్విస్ట్...


Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్


Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!


Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)


Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి