భారత్‌లో మరో కొత్త వేరియంట్ ఎంట్రీ ఇచ్చింది. ముంబయికి చెందిన ఓ వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్ XEని గుర్తించారు.  అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2 కంటే XE వేరియంట్ దాదాపు 10 రెట్లు వేగవంతమైంది. దీంతో ఈ కొత్త వేరియంట్‌పై ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అయితే దీనిని ఇంకా ఆందోళనకర వేరియంట్‌గా డబ్ల్యూహెచ్ఓ గుర్తించలేదు. దీనిపై విచారణ చేస్తోంది.


అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2 కంటే XE వేరియంట్ దాదాపు 10 రెట్లు వేగవంతమైంది. దీంతో ఈ కొత్త వేరియంట్‌పై అన్ని దేశాల ఆరోగ్య శాఖలు అప్రమత్తమయ్యాయి. అయితే దీనిని ఇంకా ఆందోళనకర వేరియంట్‌గా డబ్ల్యూహెచ్ఓ గుర్తించలేదు. దీనిపై విచారణ చేస్తోంది.


ఫోర్త్ వేవ్


ఆసియా, ఐరోపాలలోని చాలా దేశాల్లో కరోనా ఫోర్త్ వేవ్ హడలెత్తిస్తోంది. ముఖ్యంగా దక్షిణ కొరియాలో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రతిరోజు అక్కడ 5 లక్షల కొత్త కేసులు నమోదవతున్నాయి. చైనాలో కూడా పరిస్థితులు ఇలానే ఉన్నాయి. దీంతో చాలా నగరాలను లాక్‌డౌన్‌లో ఉంచారు. దీంతో ఈ వైరస్‌పై సర్వత్రా ఆందోళన ఉంది. మరి ఈ వేరియంట్ గురించి ఈ ఐదు విషయాలు తెలుసుకుందాం.







1. కాంబినేషన్


ఇప్పటివరకు గుర్తించిన కొన్ని వేరియంట్లు కలిసి కొత్త వేరియంట్‌గా ఆవిర్భవిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే చాలా సార్లు చెప్పింది. గతంలో ఒమిక్రాన్, డెల్టా కలిసి డెల్టాక్రాన్ వేరియంట్ వచ్చింది. ఇప్పుడు అలానే ఒమిక్రాన్ BA1, BA2 సబ్ వేరియంట్లు కలిపి XE వేరియంట్‌గా మారాయి. ఒక దాని కంటే ఎక్కువ వేరియంట్లు ఎవరికైనా సోకినప్పుడు ఇలా కొత్త వేరియంట్ పుడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


2. XE వైరస్ అంత డేంజరా?


పలు దేశాల్లో కరోనా ఫోర్త్ వేవ్ భయపెడుతుండటంతో ఈ వేరియంట్‌పై ఆందోళన ఉంది. అయితే ఇతర వేరియంట్లతో కలిసి కొత్తగా వచ్చే కరోనా వేరియంట్లు అంత ప్రాణాంతకం కాదని, త్వరగా చనిపోతాయని యూకే హెల్త్ ఏజెన్సీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ సుసాన్ హోప్‌కిన్స్‌ అన్నారు.


3. XE 'ఆందోళనకర వేరియంటా'?


ఈ వేరియంట్ వివరాలను డబ్ల్యూహెచ్ఓ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటివరకు ఈ వేరియంట్‌కు సంబంధించి 637 కేసులు నమోదయ్యాయి. యూకేలో ఈ వేరియంట్‌ను మొదటగా గుర్తించారు. 2022, జనవరి 19న తొలిసారి ఈ వేరియంట్ శాంపిల్స్ దొరికాయి. అయితే ఈ వేరియంట్ తీవ్రతపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని హోప్‌కిన్స్‌ అన్నారు.


4. అత్యంత వేగం 


XE వేరియంట్ చాలా వేగంగ వ్యాప్తి చెందగలదని నిపుణులు అంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఇది దాదాపు 10 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంటే అత్యంత వేగవంతమైనదని అంతా అనుకున్నారు. ఎందుకంటే తేరుకునే లోపే ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్యను భారీగా పెంచి మరో వేవ్‌ను తీసుకువచ్చింది.


5. డబ్ల్యూహెచ్ఓ పర్యవేక్షణ 


ఈ వేరియంట్‌ను డబ్ల్యూహెచ్ఓ పరిశీలిస్తోంది. దీనిపై మరింత సమాచారం సేకరిస్తోంది. మునుపటి వేరియంట్లకు ఈ వేరియంట్‌కు వ్యాప్తి, సామర్థ్యంలో ఏం తేడాలు ఉన్నాయో దర్యాప్తు చేస్తోంది.


Also Read: Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఆ పక్షమే- పార్లమెంటులో విదేశాంగ మంత్రి క్లారిటీ


Also Read: Viral Video: కూతురికి ఏం గ్రాండ్ వెల్‌కమ్‌ ఇచ్చావు కాకా! అట్లుంటది మనతోని!