ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ప్రభావం చూపుతోంది. కేసులు తగ్గుతున్నట్లే కనిపించినా.. ఒకట్రెండు రోజుల్లోనే పాజిటివ్ కేసులతో పాటు మరణాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు తప్పదని వైద్యశాఖ, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో 42,618 మంది కరోనా బారిన పడ్డారు. దేశంలో మొత్తం కరోనా కేసులు 3,29,45,907కు చేరుకున్నాయి. నిన్నటితో పోల్చితే కరోనా కేసుల రేటు 6 శాతానికి తగ్గింది.
నిన్న ఒక్కరోజులో మరో 330 మంది కొవిడ్19 మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. శుక్రవారం ఒక్కరోజులో 36,385 మంది కరోనా మహమ్మారిని జయించారు. కరోనాను నుంచి కోలుకున్న వారి సంఖ్య 3. 21 కోట్లు (3 కోట్ల 21 లక్షలు)కు చేరింది. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,40,225 (4 లక్షల 40 వేల 225)కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షలకు చేరింది. ప్రస్తుతం 4,05,681 యాక్టివ్ కేసులున్నాయి.
Also Read: Heart Attack: చిన్న వయసులోనే గుండెపోటు.. ప్రమాదంలో భారత యువత, కారణాలు ఇవే..
సగానికి పైగా కేరళలోనే..
దేశ వ్యాప్తంగా గత మూడు నెలలుగా నమోదవుతున్న కేసులలో సగానికి పైగా కేసులు ఒక్క కేరళ రాష్ట్రం నుంచే వస్తున్నాయి. 29,322 కరోనా కేసులు, 131 మరణాలు ఈ ఒక్క రాష్ట్రంలోనే సంభవించడం వైద్య శాఖ నిపులను, కేరళ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో కరోనా కేసులు తగ్గకపోవడానికి కేరళ కేంద్ర బిందువుగా మారుతోంది. కేరళలో కరోనా పాజిటివిటీ రేటు రికార్డు స్థాయిలో 17.91 శాతంగా ఉంది. కేరళ తరువాత మహారాష్ట్రలో 4,313 కరోనా కేసులు, 92 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 50 వేలకు చేరుకుంది. రికవరీ రేటు 97.04 శాతంగా ఉంది.
భారత్‌లో జనవరి నుంచి ఇప్పటివరకూ 67,72,11,205 (67 కోట్ల 72 లక్షల 11 వేల 205) డోసుల కరోనా టీకాలు పంపిణీ జరిగింది. ఇందులో గడిచిన 24 గంటల్లో 58 లక్షల 85 వేల 687 డోసుల వ్యాక్సిన్‌ను కేంద్రాల వద్ద ప్రజలు తీసుకున్నారు.