దేశంలో కరోనా కేసులు నిన్నిటి మీద కాస్త తగ్గాయి. కొత్తగా 45,352 కేసులు నమోదుకాగా 366 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 







  1. రికవరీ రేటు: 97.45%

  2. యాక్టివ్ కేసులు: 3,99,778

  3. మొత్తం రికవరీలు: 3,20,63,616

  4. మొత్తం మరణాలు: 4,39,895

  5. మొత్తం వ్యాక్సినేషన్: 67,09,59,968


దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.28 కోట్లు దాటింది. తాజాగా 34,791 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. 


కేరళలో తగ్గని ఉద్ధృతి..






కేరళలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల్లో రెండొంతులు కేరళలోనే నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 32,097 కేసులు నమోదుకాగా, 188 మంది చనిపోయారు.


కేరళతో పాటు కర్ణాటక, బంగాల్, మహారాష్ట్ర, తమిళనాడులో కూడా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి.






వ్యాక్సిన్ జోరు..


దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. నిన్న 74.84 లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 67.09 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.


ఆంధ్రప్రదేశ్‌లో కూడా కేసులు


ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 15వందల 20కేసులు నమోదయ్యాయి. 631వ బులెటిన్ విడుదల చేసిన ఎ.పి.వైద్య అరోగ్యశాఖ.. 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,520 వైరస్‌ కేసులు నమోదు కాగా... పది మంది చనిపోయినట్టు పేర్కొంది. చిత్తూరులో 188, గుంటూరులో 162, తూర్పుగోదావరిజిల్లాలో 263, విశాఖలో 90, విజయనగరంలో 12, శ్రీకాకుళంలో 37 కొత్త కేసులు నమోదైనట్టు పేర్కొంది.