COVID KILLER Tea: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు. అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా కరోనా వైరస్ దెబ్బకు అతలాకుతలం అయ్యింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన చైనా పరిస్థితి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. బయటకు వచ్చిన సమాచారం ప్రకారమే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు వాస్తవాలు రాకుండా అక్కడ ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు పాటించింది. మరోసారి ఈ రెండు దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ తాజా అధ్యయనం కీలక విషయాలను వెల్లడించింది.


కరోనా వైరస్ కు చెక్ పెట్టే 5 టీలు ఇవే!


కప్పు టీతో కోవిడ్ వైరస్ ను అంతం చేయవచ్చు అంటుంది తాజా పరిశోధన. నోటిలోనే వైరస్ ను అంతం చేసేందుకు పరిశోధకులు ఐదు రకాల టీల మీద పరిశోధన చేశారు. ఈ 5 రకాల టీలను 15 నిమిషాల పాటు వేడి చేశారు. రెండు రకాల సాంద్రతలో తయారు చేశారు. ఆ టీలో కోవిడ్ వైరస్ ను ఉంచారు. 5 నిమిషాల పాటు వెయిట్ చేశారు. ఎక్కువ సాంద్రతలో తయారు చేసిన 5 రకాల టీలలో సుమారు 10 సెకెన్లలో కోవిడ్ వైరస్ చర్యలు తగ్గుముఖం పట్టాయి.  స్టాండర్డ్ బ్లాక్ టీలో కరోనా వైరస్ 99.9 శాతం తన ప్రభావాన్ని కోల్పోయింది. గ్రీన్, మింట్, రాస్ప్ బెర్రీ, యూకలిప్టస్ లో  కరోనా వైరస్ 96 శాతం తన ప్రభావాన్ని కోల్పోయింది. మొక్కల ద్వారా లభించే పాలీ ఫెనాల్స్, సూక్ష్మ పోషకాలు కరోనా వైరస్ ను అరికట్టడంలో కీలక పాతర పోషిస్తాయని నిపుణులు వెల్లడించారు. గార్గ్లింగ్ చేయడం వల్ల కూడా లాలాజలంలోని కరోనా వైరస్ ను నూట్రల్ చేసే అవకాశం ఉందంటున్నారు.


Read Also: టీ, కాఫీలు తాగేవారికి బ్యాడ్ న్యూస్ ఇచ్చిన కొత్త అధ్యయనం.. వారికి ICMR గైడ్ లైన్స్ ఇవే


కరోనా వ్యాక్సిన్ తప్పకుండా వేసుకోవాల్సిందే!


టీ ద్వారా కరోనా ప్రభావాన్ని తగ్గించినప్పటికీ, వైరస్ ను పూర్తి స్థాయిలో రాకుండా అడ్డుకునేందుకు వ్యాక్సీన్ తప్పకుండా వేసుకోవాలని వైద్యులు వెల్లడించారు. “5 రకాల టీల ద్వారా నోటిలోని వైరస్ ను నూట్రల్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, వైరస్ ముక్కు ద్వారా కూడా ఊపిరితిత్తులకు చేరుకునే అవకాశం ఉంటుంది. తన ప్రభావాన్ని ఊపిరితిత్తుల మీద చూపించే అవకాశం ఉంటుంది. కరోనాను కొంత మేర కంట్రోల్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతాయి. కరోనా వ్యాక్సీన్ ద్వారానే పూర్తి స్థాయిలో కోవిడ్ ను అదుపు చేసే అవకాశం ఉంది” అని వైరాలజిస్ట్ మలక్ ఎస్సెలీ వెల్లడించారు. రోజూ మసాలా టీ తాగే వారికి కరోనా ముప్పు తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి.      


Read Also: కొవిడ్ న్యూ వేరియంట్ KP.2 వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఉంది.. మరో వేవ్ వచ్చే సూచనలున్నాయా?