ప్రస్తుతం ఎంతో మంది కుర్చీల్లో, బెడ్ పై, డైనింగ్ టేబుల్ మీద కూర్చుని టీవీ చూస్తూనో, కంప్యూటర్లో పని చేస్తూనో, ఫోన్ మాట్లాడుతూనో భోజనం చేస్తున్నారు. నేలపై కూర్చుని భోజనం చేసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. కానీ, నేలపై కూర్చుని భోజనం చేస్తే ఎన్నో లాభాలు కలుగుతాయట. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


* నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థకు సహకారం లభిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. 


* యూరిపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలలో ప్రచురితమైన ఓ కథనం ప్రకారం... నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని వెల్లడించారు. 


Also Read: శరీరంలో ఉన్న వేడి మొత్తం పోవాలంటే... అసలు కొంతమందికి శరీరం ఎందుకు ఎప్పుడు వేడిగా ఉంటుంది?


* కింద కూర్చుని భోజనం చేస్తే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. బీపీ కంట్రోల్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. 


* నేలపై కూర్చుని భోజనం చేస్తే బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. పొట్ట వద్ద కండరాలు ఉత్తేజితం అవుతాయి. దీంతో బరువు తగ్గడం సులభం అవుతుంది. 


* కింద కూర్చుని తినే క్రమంలో ప్రతి ముద్దకీ... మనం ముందుకీ, వెనక్కీ వంగుతూ ఉంటాం. ఇలాంటి కదలికల వల్ల రెండు లాభాలు కలుగుతాయి. ఒకటి- ఈ కదలికల వల్ల జీర్ణరసాలు తగినంతగా ఊరుతాయి. రెండు- తగినంత ఆహారం తీసుకోగానే పొట్ట నిండుగా అనిపిస్తుంది. ఇంకా తినాలన్నా తినలేం. 


Also Read: బీట్ రూట్‌ని బలవంతంగా కాదు ఇష్టంగా తినండి... ఆరోగ్యాన్ని కాపాడుకోండి... ఇదో ఔషధాల గని


* ఫ్లోర్ పై కూర్చుని తినడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అదే డైనింగ్ టేబుల్, కుర్చీలో కూర్చుంటే.. బ్లడ్ ఫ్లో హార్ట్‌కి సరిగా ఉండదు. కాబట్టి నిత్యం ఫ్లోర్ పై కూర్చుని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 


* నేలపై కూర్చుని తింటే శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది. దీంతో వెన్ను సమస్యలు రావు. గ్యాస్ సమస్యలు కూడా దూరం అవుతాయి. 


* నేలపై కూర్చుని తినేవాళ్లు ఎలాంటి ఆందోళన చెందకుండా భోజనం చేస్తారని పలు అధ్యయనాల్లో తేలింది. దీంతో ఎంత తింటున్నాం, ఏం తింటున్నామన్నది తెలుస్తుంది. దీంతో సరిపడా భోజనం చేస్తాం. 


* మీరు గమనించారో లేదో... భోజనం చేసేందుకు కూర్చునే స్థితిలో ఒక ఆసనం కనిపిస్తుంది. ఇలా నేల మీద కాళ్లు మడుచుకుని కూర్చునే భంగిమలు సుఖాసనం, అర్ధపద్మాసనాన్ని గుర్తు చేస్తాయి. జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేయటానికీ, వెన్ను నిటారుగా ఉండటానికీ, మానసిక ప్రశాంతతకూ ఈ ఆసనాలు ఎంతో సహాయపడతాయి. 


Also Read: పరగడుపును గోరు వెచ్చని నీళ్లు తాగితే ఎన్నో లాభాలో... ఆ లాభాలేంటో మీరు తెలుసుకోండి


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి