భారతీయ పురాతన వైద్య విధానం ఆయుర్వేదం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, జీవక్రియని పునరుద్ధరించడానికి ఆయుర్వేదంలో ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఆయుర్వేద వైద్యాన్ని ఇప్పటికీ కొంతమంది పాటిస్తున్నారు. ఇంగ్లీషు మందుల వల్ల నయం కాలేని జబ్బులు ఆయుర్వేద మందులకు తగ్గుతాయి. అందుకే దానికి అంతగా ప్రాధాన్యం ఇస్తారు. ఆహారంలోని పోషకాలను శరీరం ఉపయోగించుకోగలిగే శక్తిగా మార్చడానికి జీవక్రియ ఉపయోగపడుతుంది. బరువు తగ్గేందుకు సాధరణ మార్గాల కన్నా ఆయుర్వేద చిట్కాలు ఫాలో అయితే త్వరగా మీ లక్ష్యాన్ని చేరుకోగలరని నిపుణులు చెబుతున్నారు.


హెర్బల్ టీ తాగాలి: జీవక్రియను మెరుగుపరచడానికి హెర్బల్ టీలు తాగడం చాలా సులభమైన ప్రభావవంతమైన మార్గం. అల్లం, దాల్చిన చెక్క, యాలకులు వంటి మూలికల నుంచి తయారైన టీలని సహజమైన సేంద్రీయ తేనెతో కలిపి తాగాలని ఆయుర్వేదం సిఫార్సు చేస్తుంది. వాపును తగ్గించడంలో సహాయపడే శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.


పచ్చి తేనె: టాక్సిన్స్ తొలగించడం ద్వారా తేనె శరీర నిర్విషీకరణకు సహాయపడుతుంది. ఇది లిపిడ్ జీవక్రియను ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుంది. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుస్తుంది. ముడి తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరం ఆహారాన్ని సంరక్షించడంలో సహాయపడతాయి. కణాల క్షీణత నుంచి కాపాడతాయి.


జీర్ణ మూలికలు: జీర్ణక్రియ, జీవక్రియ మెరుగుపరచడానికి జీర్ణ మూలికలు ఉపయోగించాలని ఆయుర్వేదం సిఫార్సు చేస్తుంది. సోంపు గింజలు, మెంతికూర, వామ్ము, త్రిఫల వంటి జీర్ణక్రియకి సహాయపడే వాటిని తింటే మంచిది. ఇవి పోషకాల శోషణను మెరుగుపరచడంలో సహాయపడతాయి.


సోంపు గింజలు: జీర్ణక్రియని మెరుగుపరిచి వాపును తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి. పిత్త దోషాన్ని సమతుల్యం చేసి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. భోజనం తర్వాత సోంపు గింజలు ఒక టీ స్పూన్ నమలండి. లేదంటే ఒక కప్పు నీటిలో ఐదు నిమిషాల పాటు ఉడకబెట్టి వాటిని టీ చేసుకుని తాగొచ్చు.


మెంతి గింజలు: మొండి కొవ్వుని కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. మెంతులు రాత్రిపూట నానబెట్టి ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి. ఇవి జీవక్రియ రేటును పెంచుతాయి. ఆకలిని అరికడుతుంది. టాక్సిన్స్ను బయటకు పంపించి కొవ్వును కరిగించేంస్తుంది.


వామ్ము: జీర్ణక్రియ, ఆమ్లత్వం నుంచి తక్షణ ఉపశమనం కోసం వామ్ము చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కేలరీలను బర్న్ చేయడం ద్వారా బరువుని తగ్గిస్తాయి.


త్రిఫల చూర్ణం; మథనం అనేది ఆయుర్వేదం మాయా ఔషధం. శరీరం నుంచి విషాన్ని బయటకి పంపుతుంది. జీవక్రియను పెంచడంలో సహాయపడే అమలాకి(ఉసిరి) బిబితాకి, హరితాకి వంటి మూడు ఎండిన పండ్లతో ఈ చూర్ణం తయారు చేస్తారు.


యోగా: యోగా, శ్వాస వ్యాయామాలు, ధ్యానంతో జీవక్రియని పెంచుకోవచ్చు. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహకరించే అద్భుతమైన మార్గం. యోగా భంగిమలు, ఆసనాలు జీర్ణక్రియను సజావుగా సాగేలా చేస్తాయి. రక్త ప్రసరణ బాగా జరిగి యాక్టివ్ గా ఉండేలా సహాయపడతాయి.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ బనానా కాఫీ- ఇది ఎలా తయారు చేస్తారంటే!