బ్రేక్ ఫాస్ట్‌లో ఎక్కువ మంది గ్లాసుడు పాలు, ఒక అరటి పండు తినేసి... అయిపోయిందనుకుంటారు. ఆ రెండూ చాలా ఆరోగ్యకరమైనవి అని ఫీలవుతుంటారు. పాల నిండా కాల్షియం ఉంటుంది, అరటి పండు నిండా పొటాషియం ఉంటుంది. అందులోనూ వండాల్సిన అవసరం లేదు కాబట్టి సింపుల్‌గా అయిపోతుంది. కానీ ఆయుర్వేదం ప్రకారం అరటిపండు - పాలు కాంబినేషన్లో ఆహారం తినకూడదు.
ఎందుకు తినకూడదు?
జిమ్‌కి వెళ్లే వారు ముఖ్యంగా ఈ ఆహారాన్ని తినేందుకు ఇష్టపడతారు. అలాగే స్కూలుకెళ్లే పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఈ ఆహారాన్ని పెడతారు.అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ కాంబినేషన్ పాలు - అరటిపండు. అయితే ఈ ఫుడ్ కాంబో మంచిది కాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పాలల్లో కాల్షియం, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, బి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇక అరటిపండులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. విడి విడిగా తింటే ఇవి చాలా మేలు చేస్తాయి. కానీ కలిపి తింటే మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పాలు తిన్నాక 20 నిమిషాల తరువాతే అరటి పండు తినాలి. లేదా అరటి పండు తిన్నాక ఓ అరగంట తరువాతే పాలు తాగాలి అని చెబుతోంది ఆయుర్వేదం. ఈ కాంబినేషన్ ఆహారం మెదడు పనితీరును కూడా నెమ్మదించేలా చేస్తుంది.
వచ్చే సమస్యలు ఇవే
అరటిపండు - పాలు కాంబోని బ్రేక్ ఫాస్ట్ సమయంలో తినడం వల్ల వచ్చే సమస్యలు ఇవిగో...
1. శ్వాస సమస్యలు త్వరగా వస్తాయి.
2. అలెర్జీలు, ఆస్తమా ఉన్నవారికి సమస్య పెరుగుతుంది.
3. అజీర్తి
4. గ్యాస్ సమస్యలు
5. సైనస్
6. దగ్గు
7. శరీరంపై దద్దుర్లు
8. వాంతులు
9. అతిసారం
Also read: గర్భిణులకు ఫోలిక్ యాసిడ్ ఎందుకు అత్యవసరం? ఫోలిక్ యాసిడ్ తగ్గితే ఏమవుతుంది?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.