ఆయుర్వేదంలో చిరాతకు ఉన్న ప్రాధాన్యం చాలా ఎక్కువ. పరగడుపున చిరాత పానీయాన్నితాగితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీని వల్ల ఎనో అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. ఆయుర్వేద పుస్తకాల్లో చిరాత ప్రస్తావన చాలా సార్లు ఉంటుంది. దీన్నొక అద్భుతాల నిధి అని చెప్పుకోవచ్చు. దీన్ని స్వెర్టియా చిరాయితా అని శాస్త్రీయంగా పిలుస్తారు. బిట్టర్ స్టిక్, ఈస్ట్ ఇండియన్ బాల్మోనీ అని కూడా దీన్ని పిలుస్తారు. చిరత మొక్కలు హిమాలయాల్లో ఎత్తయిన ప్రదేశాల్లో పెరుగుతుంది. కాశ్మీర్ నుంచి భూటాన్ వరకు ఉన్న హిమాలయ పరిసర ప్రాంతాల్లో ఈ మొక్కలు పెరుగుతాయి. ఈ మొక్కల కాండాలను, బెరడును మలేరియా, మధుమేహం, కాలేయ రుగ్మతలను దూరం చేసేందుకు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.
నిండుగా పోషకాలు...
చిరాత కాండాన్ని, బెరడును ఉపయోగించి ఆయుర్వేద మందులను తయారుచేస్తారు. ఈ హెర్బ్‌లో సహజంగా యాంటీ ఆక్సిడెంట్లు, ఆల్కలాయిడ్స్, గ్లైకోసైడ్స్, చిరటానిన్, చిరాటోల్, పాల్మిటిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.ఈ పోషకాలు శరీరానికే కాకుండా మెదడుకు, నాడీ వ్యవస్థకు కూడా ఎంతో మేలు చేస్తుంది. చిరాతలో స్వెర్టియామార్టిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు చికిత్స చేయడంలో ఇది సహాయపడుతుంది. మూర్ఛకు చికిత్స చేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే దీనివల్ల దద్దుర్లు, దురద, మంట వంటి చర్మ సమస్యలు పోతాయి.
చిరాత టీ ఎలా తయారు చేయాలి?
చిరాత కాండాలు లేదా బెరడులతో చేసిన టీని రోజూ పరగడుపున తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎండిన ఈ కాండాలు, బెరడులను పొడిలా చేసి అమ్ముతారు. లేదా పచ్చి బెరడు దొరికినా మంచిదే. నీటిలో పచ్చి బెరడు లేదా పొడిని వేసి బాగా మరిగించాలి. వడపోసి ఆ టీని వేడిగా తాగితే ఎంతో మేలు జరుగుతుంది. ఈ టీని భోజనం తరువాత తాగితే మలబద్ధకం సమస్య పోతుంది. ఈ టీని తాగడం వల్ల మధుమేహం సమస్య కూడా అదుపులో ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి. కాబట్టి డయాబెటిక్ రోగులు రోజుకు ఒకసారి చిరాత టీ తాగితే ఎంతో మంచిది.
Also read: నిద్ర పట్టడం లేదా? పీడకలలు వస్తున్నాయా? రాత్రిపూట ఈ ఆహారాలను దూరం పెట్టండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.