దక్షిణాదిలో అత్యంత రసికులు ఆంధ్రప్రదేశ్ ( AP )  మగవాళ్లేనట. వాళ్లు సగటున నలుగురు మహిళలతో లైంగిక సంబంధాలు ( Sex Relations ) పెట్టుకుంటున్నారు. ఈ విషయం జాతీయ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ( MoHFW ) నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ( NFHS-5 )లో వెల్లడయింది. 2020 - 2021 మధ్య కాలంలో నిర్వహించిన రెండో దశ సర్వేలో ఏపీలోని ఎక్కువ మంది మగవాళ్లు తమ లైంగిక సంబంధాల గురించి విపులంగా వివరించారు. సర్వే ఫలితాలను విశ్లేషిస్తే ఆంధ్రలో ఒక్కో మగ వ్యక్తి సగటున నలుగురు కంటే ఎక్కువ మంది మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారు. 


గర్భంతో ఉన్నప్పుడు ఈ మందులు వాడితే ఎంత ప్రమాదమో తెలుసా? వీలైనంత వరకు వాడకపోతేనే మంచిది


మహిళలు వారి జీవిత కాలంలో సగటున 1.4 మంది లైంగిక భాగస్వాములను మాత్రమే కలిగి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ మగవాళ్లు కాస్త సంయమనంతో ఉన్నారు. వారు తమ జీవిత కాలంలో ముగ్గురితో మాత్రమే లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారట. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలయిన కర్ణాటకలో పురుషులు 2.7  , అండమాన్ & నికోబార్ దీవులలో పురుషులు 2.8, కేరళ మరియు లక్షదీప్ పురుషులు ఒక్కొక్కరు, పుదుచ్చేరి మరియు తమిళనాడు పురుషులు 1.2 ,  1.8 మంది లైంగిక భాగస్వాములుక కలిగి ఉంటున్నట్లుగా సర్వేలో తేలింది. 


ఇక ఆ దేశంలో మహిళల కోసం నెలలో ఆ మూడు రోజులు ‘పీరియడ్స్ లీవ్’


ఎయిడ్స్ వంటి సుఖ వ్యాధులు.. ఇతర  అంశాలపై ప్రజల్లో ఎంత అవగాహన ఉందో కూడా సర్వేలో తెలుసుకున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రాథమిక లక్ష్యం ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమంపై అవసరమైన డేటా సేకరించడంతో పాటు పెరుగుతున్న లైంగిక పరమైన ఆరోగ్య సమస్యలను గుర్తించడం. ప్రస్తుతానికి సర్వే రెండో దశ ఫలితాలు మాత్రమే విడుదల చేశారు. మొత్తం సర్వే పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి ఫలితాలు విడుదల చేయనున్నారు. 


ఫోన్‌తో అధిక సమయం గడుపుతున్నారా? ఈ వయసు వారిలో ఆత్మహత్యా ఆలోచనలు కలిగే అవకాశం


జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే మొదటి దశలో స్త్రీలలో లైంగిక విజ్ఞానం, ఆరోగ్యం, సంతానోత్పత్తి ఇతర అంశాలపై సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఆధారంగా కేంద్రం ప్రజల్ని చైతన్య వంతల్ని చేసే ప్రయత్నాలు చేస్తుంది.