Logically Facts Fact Check:


ఫ్యాక్ట్‌చెక్..


సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చాలా వేగంగా వైరల్ అయిపోతాయి. నచ్చిందంటే చాలు తెగ షేర్ చేసేస్తుంటారు. ఈ హడావుడిలో అసలు అది నిజమా కాదా అన్నదీ పట్టించుకోరు. అందుకే ఎన్నో ఫేక్ వీడియోలు సర్య్కులేట్ అవుతుంటాయి. ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో వైరల్ అవుతోంది. ఇజ్రాయేల్, హమాస్ యుద్ధానికి సంబంధించిన విజువల్స్‌గా ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయేల్ సైన్యం గాజాలో (Israel-Hamas War) టన్నెల్స్‌లో దాక్కున్న హమాస్ ఉగ్రవాదుల్ని ఎలా మట్టుబెడుతోందో చూడండి అంటూ షేర్ చేశారు చాలా మంది. భారీ ఎత్తున ముంచెత్తుతున్న వరదల్లో పడవలు, కార్లు కొట్టుకుపోతున్నాయి. ఇళ్లనూ నీళ్లు ముంచేస్తున్నాయి. ఇజ్రాయేల్ సైన్యం పాలస్తీనాలో అండర్ గ్రౌండ్ టన్నెల్స్‌లోకి సముద్రపు నీళ్లు పంపి అక్కడి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తోందని ట్విటర్‌లో ఈ వీడియో షేర్ చేశారు. అయితే..ఈ వీడియోకి (వీడియో కోసం క్లిక్ చేయండి) ఇజ్రాయేల్ యుద్ధానికి ఎలాంటి సంబంధం లేదని Logically Facts Fact Checkలో తేలింది. ఇది చాలా పాత వీడియో. జపాన్‌లో సునామి వచ్చినప్పటి దృశ్యాలివి. వాటిని ఇజ్రాయేల్ హమాస్ యుద్ధానికి లింక్ చేశారు. వీడియోలోని కీ ఫ్రేమ్స్‌తో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే కానీ అసలు విషయం తెలియలేదు. ఈ సెర్చ్‌లో తెలిసిందేంటంటే...ఇది 2011లో జపాన్‌లో సునామి వచ్చినప్పటి వీడియో. దీన్ని నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్‌తో పాటు Mirror UK ఛానల్‌ అప్పట్లో షేర్ చేసింది. 




Image Credits: X


ఇదీ అసలు సంగతి..


జపాన్ న్యూస్‌ నెట్‌వర్క్ ANN Newsలోనూ ఇందుకు సంబంధించిన పూర్తి వీడియో అప్‌లోడ్ అయింది. 2020 జనవరి 7వ తేదీన ఈ వీడియో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో టైటిల్ ప్రకారం చూస్తే...2011లో మార్చి 11న సునామి కారణంగా మియాకో సిటీని వరదలు ముంచెత్తాయి. అప్పటి వీడియో ఇది. ఈ వీడియోలో మియాకో సిటీ సైన్‌బోర్డ్ కనిపించింది. గూగుల్ స్ట్రీట్‌ వ్యూలోనూ చాలా క్లియర్‌గా అక్కడి లొకేషన్స్‌ కనిపిస్తున్నాయి. అది జపాన్‌ అని అనడానికి అన్ని ఆధారాలున్నాయి. 2011 మార్చి 11వ తేదీన పసిఫిక్ మహా సముద్రంలో 9.1 తీవ్రతతో సునామీ వచ్చింది. దాదాపు ఆరు నిముషాల పాటు  తీవ్రత కొనసాగింది. ఈ సునామీ కారణంగా 18 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల Wall Street Journal కూడా ఈ వీడియోని ఇజ్రాయేల్, హమాస్ వార్‌తో లింక్ పెట్టింది. 



Image Credits: Youtube


Disclaimer: This report first appeared onlogicallyfacts.com, and has been republished on ABP Desam as part of a special arrangement.