ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా 'యాత్ర' సినిమా తెరకెక్కించారు దర్శకుడు మహి వి రాఘవ్. వైయస్సార్ మరణం తర్వాత ఆయన కుమారుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అనేది 'యాత్ర 2'లో చూపించనున్నారు. ఫిబ్రవరి 8న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంత కంటే ఐదు రోజుల ముందు ట్రైలర్ చూపించనున్నారు. 


ఫిబ్రవరి 3న 'యాత్ర 2' ట్రైలర్ విడుదల
'యాత్ర 2' సినిమాలో వైయస్ జగన్, భారతి దంపతులుగా జీవా, కేతికా నారాయణ్ నటించారు. వైయస్సార్ పాత్రలో మరోసారి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఫిబ్రవరి 3న, ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.


త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక 'యాత్ర 2' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'యాత్ర' విడుదలైన ఫిబ్రవరి 8న 'యాత్ర 2' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. వైఎస్ భారతిగా కేతికా నారాయణన్, సోనియాగా సుజానే పర్ఫెక్ట్ యాప్ట్ అని టీజర్ చూసిన తర్వాత జనాలు చెబుతున్నారు. జగన్ పాత్రలో జీవా సైతం ఒదిగిపోయారు.


Also Readబ్రహ్మానందం కమెడియన్ కాదు... అంతకు మించి, గుండెల్ని పిండేసేలా హాస్య బ్రహ్మ కంటతడి పెట్టించిన క్యారెక్టర్లు ఏవో తెలుసా? 






తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం...
తనయుడు చేసిన యుద్ధం, మాట తప్పని వైనం!
తండ్రికి ఇచ్చిన మాట కోసం, ఆ మాటను నెరవేర్చడం కోసం తనయుడు ఎలాంటి యుద్ధం చేశాడు? ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఏం చేశాడు? అనేది 'యాత్ర 2'లో మెయిన్ పాయింట్ అని తెలిసింది. వైఎస్ జగన్ జీవితంలో కొన్ని అంశాలు తీసుకుని మహి వి రాఘవ్ సినిమా చేశారట. జగన్ పాత్ర చేసిన జీవా సైతం ''ఈ సినిమాలో తండ్రి కుమారుల అనుబంధం ఎక్కువ ఉంటుంది. రాజకీయాలు తక్కువ ఉంటాయి'' అని చెప్పారు. 


Also Read: 'దిల్' రాజు ఇంట్లో పెళ్లి సందడి - యంగ్ హీరోకి కాబోయే భార్య ఎవరంటే?


సినిమాలో షర్మిల, పవన్ పాత్రలు లేవు!
తండ్రి కుమారుల కథపై ఎక్కువ ఫోకస్ చేయడంతో 'యాత్ర 2'లో వైఎస్ షర్మిల పాత్రకు ఆస్కారం లేదని తెలిసింది. సో... 'యాత్ర 2'లో వైఎస్ షర్మిల క్యారెక్టర్ లేదు. ఆ మాటకు వస్తే... 'యాత్ర' సినిమాలోనూ ఆమె రోల్ లేదు. 'యాత్ర 2'లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా లేదని తెలిసింది. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రలో మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీగా సుజానే బెర్నెర్ట్ నటించారు.


Also Read: చిరంజీవి దగ్గరకు వెళ్లిన పవన్ కళ్యాణ్ దర్శకుడు!