అగ్ర నిర్మాత 'దిల్' రాజు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఆయన ఫ్యామిలీ నుంచి నట వారసుడిగా అడుగు పెట్టిన యువ హీరో ఈ నెలలో ఏడు అడుగులు వేయనున్నారు. దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి పెళ్లి పిలుపులు మొదలు పెట్టారు. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)ని కలిసి శుభలేఖ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
ప్రేమికుల రోజున ఆశిష్ రెడ్డి పెళ్లి
'రౌడీ బాయ్స్'తో ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అయ్యారు. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. వసూళ్లు కూడా సాధించింది. హీరోగా మొదటి సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఆశిష్... ఇప్పుడు రియల్ లైఫ్‌లో కూడా సెటిల్ కానున్నారు.
Rowdy Boys Hero Ashish Reddy Wedding Date and Venue Details: ప్రేమికుల రోజు... అంటే ఫిబ్రవరి 14న ఆశిష్ రెడ్డి ఓ ఇంటి వాడు కాబోతున్నారు. పింక్ సిటీ జైపూర్‌లో ఒక ప్యాలెస్‌లో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు.
ఆశిష్ రెడ్డికి కాబోయే భార్య ఎవరంటే?
ఏపీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో దిల్ రాజు, శిరీష్ రెడ్డి ఫ్యామిలీ వియ్యం అందుకుంటున్నట్లు తెలిసింది. అద్వైత రెడ్డి అనే అమ్మాయిని ఆశిష్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ సంబంధం కుదరడంలో క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఇండస్ట్రీ ఖబర్. ఆయన దర్శకుడిగా పరిచయమైన 'ఆర్య' చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. అప్పట్నుంచి ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి.
హైదరాబాద్‌లో 20వ తేదీన రిసెప్షన్!
ఈ నెల 14న జైపూర్ సిటీలో డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే... 20వ తేదీన తెలుగు సినీ, రాజకీయ ప్రముఖుల కోసం హైదరాబాద్ సిటీలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అయితే కొంత మంది సినిమా ప్రముఖులను జైపూర్ లో పెళ్లికి హాజరు కావాల్సిందిగా 'దిల్' రాజు ఫ్యామిలీ స్పెషల్ ఇన్విటేషన్స్ ఇచ్చింది.
ఎన్టీఆర్‌ను కలిసిన 'దిల్' రాజు ఫ్యామిలీ
దిల్ రాజు ఫ్యామిలీకి చిత్రసీమలో హీరోలు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే, దర్శకులతో కూడా! అందుకని, వాళ్లకు ప్రత్యేక ఆహ్వానాలు ఇస్తున్నారు. బుధవారం ఎన్టీఆర్‌ను కలిసి పెళ్లికి తప్పకుండా హాజరు కావాలని కోరారు. దిల్ రాజు, శిరీష్, కాబోయే పెళ్లి కొడుకుతో పాటు కుమార్తె హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి కూడా 'దేవర'తో ఫోటోలు దిగారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', 'ది' విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. చిరంజీవితో ఓ సినిమా చర్చల దశలో ఉంది. ఆయన సంస్థలో సినిమాలు చేసిన, చేస్తున్న హీరోలు పెళ్లికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read: స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?