ESI Case refused to consider charge sheet against Achchennaidu  :  ఈఎస్‍ఐ కేసులో అచ్చెన్నాయుడుపై  చార్జిషీట్‍ను పరిగణలోకి తీసుకునేందుకు ఏపీసీ కోర్టు నిరాకరించింది. విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జిషీట్‍ వేసేందుకు సీఐడీ అధికారులు వచ్చారు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం చార్జిషీట్ వేసేందుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి అని  న్యాయమూర్తి  స్పష్టం చేశారు. చార్జిషీట్ పరిగణలోకి తీసుకోలేమని న్యాయమూర్తి తెలిపారు. అయితే  పరిగణలోకి తీసుకోవచ్చని చెప్పిన ఏసీబీ తరపు న్యాయవాదులు వాదించారు. దీనికి సంంధించిన కేసుల్లో తీర్పులు ఏమైనా ఉంటే చూపించాలని న్యాయనూర్తి ఆదేశించారు.  కేసు విచారణ ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేశారు.                       


ఇప్పుడీ అంశం సంచలనంగా మారింది. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుుడు ఈఎస్ఐ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఆయన స్వగ్రామం నిమ్మాడలో ఆపరేషన్ చేయించుకుని ఉన్న సమయంలో సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.  ఇంటి గోడలు దూకి మరీ తెల్లవారుజామున అచ్చెన్నను అరెస్టు చేశారు. ఒక్క నోటీసు ఇస్తే ఆయన వస్తారు. కానీ అదేమీ ఇవ్వకుండా అలా అరెస్టు చేశారని టీడీపీ నేతలు మండిపడ్డారు. తర్వాత ఆయనను  రోడ్డు మార్గం ద్వారా ఆయనను గుంటూరు తీసుకెళ్లారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు రిమాండ్ విధించడంతో కరోనా సమయంలోనూ  దాదాపుగా రెండున్నర నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యారు.                               


2020 జూన్ 12వ తేదీన అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. ఈ స్కాంలో రూ.151 కోట్ల మొత్తం చేతులు మారాయని ఏసీబీ అధికారులు ప్రకటించారు. ఇందులో మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా నిందితుడిగా ఉన్నట్లు అప్పటి ఏసీబీ జేడీ రవికుమార్‌ తెలిపారు. కానీ ఆయనను అదుపులోకి తీసుకోలేదు.              


2014 నుంచి 2019 మధ్య సాగిన ఈఎస్‌ఐ స్కాంలో మొత్తం రూ.151 కోట్ల మొత్తం అదనపు చెల్లింపులు జరిగినట్లు ఏసీబీ ఇప్పటికే గుర్తించింది. అయితే మొత్తం ఈఎస్‌ఐకి కేటాయించిన రూ.970 కోట్ల బడ్జెట్‌లో ఈ మొత్తం ఎలా చేతులు మారిందనే అంశంపై తాజాగా ఏసీబీ మరిన్ని ఆధారాలు సంపాదించిందని అధికారులు ప్రకటించారు.  వీటికి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని అంటున్నారు.  అయితే మూడేళ్లు అయినా ఇంత వరకూ చార్జిషీటు దాఖలు చేయలేదు. ఇప్పుడు చార్జిషీటు దాఖలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ కోర్టు పరిగణనలోకి తీసుకునేందుకు అంగీకరించకపోవడం ఏసీబీ అధికారులకు ఇబ్బందికరంగా మారింది.