ఉర్ఫీ జావెద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అత్యంత చెత్త ట్రెండ్‌ను ఫాలో అయ్యే ఏకైక అరుదైన మోడల్ ఉర్ఫీ జావెద్. ఈమెకు బుల్లితెర నటి కంటే.. ఈ చిత్ర విచిత్ర దుస్తులతోనే ఎక్కువ గుర్తింపు లభించింది. ఈ పాపులారిటీతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈమె దుస్తులు వేసుకున్నా.. వేసుకోలేనట్లే ఉంటుందని నెటిజనులు కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎక్స్పోజింగ్ చేయడంలో ఈమెకు ఎవరూ పోటీ రాలేరు కూడా. అందుకే, 2021లో హిందీ ‘బిగ్ బాస్’ ఓటీటీలో ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత ఆమెకు మరింత పాపులారిటీ పెరిగింది.
సాధారణంగా ఎక్స్పోజింగ్ దుస్తులు వేసుకొనే మోడల్స్ ర్యాంప్ మీద క్యాట్ వాక్కే పరిమితం అవుతారు. ఉర్ఫీకి మాత్రం అలాంటి దుస్తులు ధరించి నేరుగా పబ్లిక్లోకే వచ్చేస్తుంది. అయితే, ఈమె రోజూ పని ఉన్న, లేకపోయినా మోడ్రన్ దుస్తులు ధరించి విమానాశ్రయానికి వెళ్తుంది. చిత్రం ఏమిటంటే ఆమె ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేది విమానం ఎక్కేందుకు కాదు. అక్కడ సెలబ్రిటీల కోసం వేచి చూసే ఫొటోగ్రాఫర్లను ఆకట్టుకోడానికి. ఎందుకంటే.. ఇంట్లో ఫొటోసెషన్ చేయాలంటే చాలా ఖర్చవుతుంది. అదే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తే ఆ ఖర్చే ఉండదు. మీడియా.. వద్దన్నా సరే ఆమెకు ఫొటోలను తీస్తుంది. అందుకే, ఆమె రోజూ విమానాశ్రయానికి వెళ్తుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్నే కొందరు ఉర్ఫీ జావెద్‌ను అడిగారు. ఇందుకు ఆమె సమాధానం ఇస్తూ.. ‘‘నేను ఎక్కడికెళ్తే మీకేంటీ?’’ అంటూ ఓ సినిమాలోని డైలాగ్ వీడియోను పోస్ట్ చేసింది. అదే ఈ వీడియో.
Also Read : నెట్‌ఫ్లిక్స్‌లో అడివి శేష్ 'మేజర్' స్ట్రీమింగ్ తేదీ ఇదే
Also Read : మేనకోడల్ని నిర్మాతగా పరిచయం చేస్తున్న అల్లు అరవింద్ - కొత్త సినిమా షురూ