శాంసంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్6 ప్రో స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ప్రపంచంలో 5జీ కనెక్టివిటీ ఉన్న మొదటి రగ్గ్‌డ్ స్మార్ట్ ఫోన్ ఇదే శాంసంగ్ అంటోంది. ఇందులో 6.6 అంగుళాల పీఎల్ఎస్ ఎల్సీడీ స్క్రీన్ ఉండనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ అందించారు. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉండనున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్6 ప్రో ధర
ఈ ఫోన్ ధరను శాంసంగ్ ఇంకా వెల్లడించలేదు. అయితే యూరోప్, ఆసియా, మిడిల్ ఈస్ట్‌ల్లో ఈ ఫోన్ జులైలో లాంచ్ కానుందని సమాచారం. జులై 13వ తేదీన ఈ ఫోన్ లాంచ్ కానుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ శాంసంగ్ ముందే తీసుకువచ్చేసింది.
శాంసంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్6 ప్రో స్పెసిఫికేషన్లు
ఇందులో 6.6 అంగుళాల పీఎల్ఎస్ ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. ఐపీ68 డస్ట్, వాటర్ ప్రొటెక్షన్ ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయింది. దీని మందం 0.99 సెంటీమీటర్లు కాగా, బరువు 235 గ్రాములుగా ఉంది.
స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను ఇంకా పెంచుకునే అవకాశం ఉంది. 4050 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది. ఎక్స్‌కవర్ సిరీస్‌లో 5జీ కనెక్టివిటీ ఉన్న మొదటి ఫోన్ ఇదే అని కంపెనీ అంటోంది.
ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!