Major Movie OTT Release Date: నెట్‌ఫ్లిక్స్‌లో అడివి శేష్ 'మేజర్' - మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన 'మేజర్' సినిమా ఓటీటీలో విడుదల కావడానికి ఇంకెన్నో గంటల సమయం లేదు. నెట్‌ఫ్లిక్స్‌లో ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందంటే...

Continues below advertisement

ముంబై ఉగ్రదాడిలో సామాన్య ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాలను అర్పించిన అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan Biopic - OTT Release Date). ఆయన జీవితం, ఉగ్రదాడి ఆధారంగా రూపొందిన సినిమా 'మేజర్'. అడివి శేష్ టైటిల్ రోల్‌లో నటించారు. జూన్ 3న థియేటర్లలో సినిమా విడుదల అయ్యింది. ఆ రోజు నుంచి లెక్కపెడితే... సరిగ్గా నెలకు ఓటీటీలోకి వస్తోందీ సినిమా.
 
'మేజర్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. జూలై 3న సినిమాను విడుదల చేస్తున్నామని నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. సో... 'మేజర్' ఓటీటీ విడుదలకు ఇంకెన్నో గంటల సమయం లేదు. ఈ వీకెండ్ చూడవచ్చు.

Continues below advertisement

Also Read : పోలీసులు, ప్రజలూ హీరోనే కొడుతుంటే...
 
అడివి శేష్‌కు జంటగా సయీ మంజ్రేకర్, ప్రధాన పాత్రలో శోభితా ధూళిపాళ్ల, హీరో తల్లిదండ్రులుగా ప్రకాష్ రాజ్, రేవతి నటించిన ఈ సినిమాకు శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. మహేష్ బాబు, నమ్రత, అనురాగ్, శరత్ నిర్మించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది. 

Also Read : మేనకోడల్ని నిర్మాతగా పరిచయం చేస్తున్న అల్లు అరవింద్ - కొత్త సినిమా షురూ

Continues below advertisement