దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'విరాటపర్వం'. ఈ సినిమాను వేణు ఊడుగుల డైరెక్ట్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది వేసవిలో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడి.. ఫైనల్ గా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. నిజానికి ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకున్నారు సురేష్ బాబు. 


కానీ రానా ఒప్పుకోకపోవడంతో థియేటర్లలో విడుదల చేశారు. తీరా విడుదలైన తరువాత ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది. రానా, సాయిపల్లవిల పెర్ఫార్మన్స్ కి మంచి పేరొచ్చినప్పటికీ.. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సాగిన ఈ సినిమా జనాలను మెప్పించలేకపోయింది. దీంతో మొదటి వీకెండ్ కి ఈ సినిమా చతికిలపడింది. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 


ఫ్లాప్ టాక్ రావడంతో అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ఉన్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 'విరాటపర్వం' సినిమా హక్కులను దక్కించుకుంది. జూలై 1న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను ప్రసారం చేయబోతున్నారు. 


Also Read : విడాకుల వార్తలపై స్పందించిన సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర


Also Read : మగబిడ్డకు జన్మనిచ్చిన 'దిల్' రాజు భార్య తేజస్విని వ్యాఘా రెడ్డి