Vikram Movie Telugu OTT Release: ఓటీటీలో కమల్ హాసన్ 'విక్రమ్' వచ్చేది ఆ రోజే - ఇట్స్ అఫీషియల్
కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా 'విక్రమ్' ఓటీటీ విడుదల తేదీ కన్ఫర్మ్ అయ్యింది.

'విక్రమ్' సినిమాతో లోక నాయకుడు కమల్ హాసన్ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. తమిళ్, తెలుగు అని వ్యత్యాసం లేదు. ఇండియా, అమెరికా అని తేడా లేదు. విడుదలైన ప్రతి ఏరియాలోనూ మంచి వసూళ్లు సాధించింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలకు లాభాలు తీసుకు వచ్చింది.
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మాణంలో పాలు పంచుకున్న సినిమా 'విక్రమ్'. జూన్ 3న థియేటర్లలో విడుదల అయ్యింది. ఇప్పుడీ సినిమా అతి త్వరలో ఓటీటీలో విడుదల కానుంది.
జూలై 8న 'విక్రమ్' డిజిటల్ రిలీజ్‌కు ప్లాన్ చేశామని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ తెలిపింది. తెలుగు, తమిళ భాషల్లో ఆ రోజు నుంచి 'విక్రమ్' సినిమా వీక్షకులకు అందుబాటులోకి రానుంది.
Also Read : విడాకుల వార్తలపై స్పందించిన సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర
'విక్రమ్' సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయి.
Also Read : రియల్ లైఫ్ 'మహర్షి'తో రీల్ లైఫ్ మహర్షి - బిల్ గేట్స్‌తో మహేష్ బాబు భేటీ