సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన 'మహర్షి' సినిమా గుర్తు ఉందా? అందులో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కల కంపెనీకి సీఈవోగా ఆయన నటించారు. సామాన్యుడి నుంచి సెలబ్రిటీగా ఎదిగిన బిజినెస్ టైకూన్‌గా సూపర్ స్టార్ కనిపించారు. రియల్ లైఫ్‌లో అటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అని చూస్తే... బిల్ గేట్స్ కనిపిస్తారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఫౌండర్స్‌లో ఆయన ఒకరు. ఇప్పుడు బిల్ గేట్స్ ప్రస్తావన ఎందుకంటే...
రియల్ లైఫ్ 'మహర్షి'ని రీల్ లైఫ్ 'మహర్షి' కలిశారు. వీళ్ళిద్దరి కలయికకు అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదిక అయ్యింది. ''ఎంతో మందికి స్ఫూర్తి ఇచ్చిన, ఈ ప్రపంచం చూసిన గొప్ప దార్శనికుడు బిల్ గేట్స్‌ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చాలా వినయపూర్వకంగా ఉన్నారు. నిజంగా స్ఫూర్తి నింపారు'' అని మహేష్ బాబు పేర్కొన్నారు.
Also Read : మగబిడ్డకు జన్మనిచ్చిన 'దిల్' రాజు భార్య తేజస్వి, వారసుడొచ్చాడు
భార్య నమ్రత, పిల్లలు గౌతమ్ అండ్ సితార... కొన్ని రోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి మహేష్ న్యూయార్క్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ టూర్ ముగిసింది. న్యూయార్క్ నుంచి వచ్చే ముందు బిల్ గేట్స్‌ను మహేష్ కలిశారు.
Also Read : కమెడియన్ గుండెల మీద పచ్చబొట్టుగా నాగబాబు పేరు, గుండెల్లో నాగబాబు
న్యూయార్క్ నగరంలో లాస్ట్ డే అంటూ మహేష్ కుమార్తె సితార ఘట్టమనేని చేసిన పోస్ట్ (Sitara Ghattamaneni Last Day In New York City):