హిందీ చలన చిత్ర పరిశ్రమలో... ముఖ్యంగా ఇటు కపూర్ ఫ్యామిలీ, అటు భట్ ఫ్యామిలీలో ర‌ణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంట పండుగ వాతావరణం తీసుకు వచ్చింది. ఆలియా గర్భవతి కావడంతో ఫెస్టివల్ మూడ్ నెలకొంది. బాలీవుడ్ సెలబ్రిటీలు ర‌ణ్‌బీర్ - ఆలియా జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. పెళ్ళైన రెండున్నర నెలలకు 'ఆర్ఆర్ఆర్' హీరోయిన్ ప్రెగ్నెంట్ అయిన సంగతి తెలిసిందే. అయితే... ఈ హ్యాపీ మూమెంట్స్‌లో ఆలియాను ఒక వార్త చికాకు పెట్టింది.


ఆలియా భట్ ప్రెగ్నెన్సీ మీద హిందీ మీడియాలో ఒక కథనం వచ్చింది. గర్భవతి కావడంతో షూటింగ్స్ వాయిదా పడుతున్నారని... ప్రజెంట్ యూకేలో షూటింగ్ చేస్తున్న షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక ఆమెను ర‌ణ్‌బీర్ పికప్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని రాసుకొచ్చారు. దానిపై ఆలియా భట్ మండిపడ్డారు. 


''మనం ఇంకా కొంత మంది బుర్రల్లో (ఆలోచనల్లో) బతుకుతున్నాం. ఇప్పటికీ పితృస్వామ్య ప్రపంచంలో జీవిస్తున్నాం. ఏదీ (షూటింగ్స్) ఆలస్యం కాలేదు. ఎవరూ ఎవరినీ పికప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనో మహిళను, పార్శిల్ కాదు పికప్ చేసుకోవడానికి! నేను విశ్రాంతి తీసుకోనవసరం లేదు'' అని ఆలియా భట్ పేర్కొన్నారు. 


Also Read : బ్రేకింగ్ న్యూస్ - హీరోయిన్ మీనా భర్త మృతి


మనం 2022లో ఉన్నామని, పాత కాలపు ఆలోచనా పద్ధతుల నుంచి బయటకు రాగలమా? అని ఆలియా ప్రశ్నించారు. షాట్ రెడీ కావడంతో షూటింగ్ చేయడానికి వెళ్తున్నాని ముగించారు. 


Also Read : కమెడియన్ గుండెల మీద పచ్చబొట్టుగా నాగబాబు పేరు, గుండెల్లో నాగబాబు