Dil Raju and Tejaswini Becomes Parents To Baby Boy: ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఇంట సంతోష వాతావరణం నెలకొంది. ఆయన ఇంట వారసుడొచ్చాడు. 'దిల్' రాజు భార్య తేజస్విని వ్యాఘా రెడ్డి బుధవారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం తెలియడంతో పలువురు ప్రముఖులు 'దిల్' రాజుకు కంగ్రాట్స్ చెబుతున్నారు.






కరోనా సమయంలో, రెండేళ్ల క్రితం... డిసెంబర్ 10, 2020లో 'దిల్' రాజు, తేజస్విని వివాహం జరిగింది. నిజామాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుక నిర్వహించారు.


Also Read : నేను ఏమైనా పార్శిలా? మా ఆయన పికప్ చేసుకోవడానికి! - సైలెంట్‌గా క్లాస్ పీకిన ఆలియా భట్
 
'దిల్' రాజుకు తేజస్విని వ్యాఘా రెడ్డి రెండో భార్య. మొదటి భార్య అనిత 2017లో మరణించారు. 'దిల్' రాజు, అనిత దంపతులకు ఒక కుమార్తె. ఆమె పేరు హన్షితా రెడ్డి. ప్రస్తుతం కొన్ని సినిమాల నిర్మాణ కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. సమంత 'శాకుంతలం' సినిమా ప్రొడక్షన్ పనులు చూసుకున్నారు.   


Also Read : కమెడియన్ గుండెల మీద పచ్చబొట్టుగా నాగబాబు పేరు, గుండెల్లో నాగబాబు


కుమార్తె హన్షితా రెడ్డితో 'దిల్' రాజు :