గుప్పెడంతమనసు జూన్ 29 ఎపిసోడ్ (Guppedantha Manasu June 29 Episode 489)


స్కాలర్ షిప్ టెస్టులో వసుధార సక్సెస్ అవడంతో కంగ్రాట్స్ చెప్పేసి...అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి
రిషి: అమ్మవారి దగ్గరకు వెళ్లి నమస్కారం పెట్టుకున్న రిషి..నా మనసేంటో నీకు తెలుసు నాకేం కావాలో నీకు తెలుసు నువ్వే చేసెయ్ అంటాడు. ఎన్నో కష్టాలతో ఇంట్లోంచి బయటకు వచ్చింది చదువులో గెలిచింది, జీవితంలో ఓడిందో, గెలిచిందో తెలియదు..తనని నువ్వే నడిపించు. ఇప్పటి వరకూ చదువులో అండగా నిలిచావ్, ఇకపై కూడా నువ్వే నడిపించాలి అంటూ అమ్మవారి ముందు  పసుపుతో వసుధార అని రాస్తాడు రిషి. అమ్మా తనని నువ్వే కాపాడాలి అని పదే పదే మనసులో అనుకుంటాడు. అక్కడి నుంచి రిషి వెళ్లగానే వసుధార వస్తుంది. 
వసుధార: ఈ విజయం ఎవరిదో నీకు తెలుసు అమ్మా, రిషి సార్ లేకపోతే నేను లేను, ఈ విజయం లేదు.. జగతి మేడం ఇక్కడకు తీసుకొచ్చారు, రిషి సార్ ధైర్యం ఇచ్చారు. నా మనసులో ఏముందో నీకు తెలుసు, అవునా కాదా అనే మేఘాలు కరిగిపోయాయి...నా మనసు నిర్మలంగా ఉంది. మిగిలిన ధైర్యం నువ్వే ఇవ్వాలి..వసుధారని మారుస్తావో రిషి సార్ ని మారుస్తావో ఏం చేసినా అంతా నీ దయే అమ్మా అని దణ్ణం పెట్టుకుని ప్రదిక్షిణ చేస్తుంది. పసుపుతో రిషి రాసిన వసుధార పేరుపై గాలికి పువ్వులు వచ్చి చేరుతాయి. 


Also Read: హిమ కోసం డాక్టర్ సాబ్, శౌర్య కోసం హిమ అమ్మవారికి ముడుపులు, ఎవరి కోరిక నెరవేరుతుంది !


అటు రిషి క్యాబిన్లో వెయిట్ చేస్తున్న మహేంద్ర...కొడుక్కి కాల్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేయనీ వాడిపని చెబుతాను అంటాడు కానీ అటు రిషి కాల్ కట్ చేస్తాడు. మళ్లీ కాల్ చేసిన మహేంద్ర ఏదో చెప్పేలోగా నేను మళ్లీ కాల్ చేస్తానని చెప్పి కట్ చేస్తాడు. అటు వసుధార కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుని రిషి సార్ కి నాపై కోపం పోవాలని కోరుకుంటూ కుంకుమతో రిషి పేరు అక్కడ రాస్తుంది. కుంకుమ అయ్యవారికి ప్రతిరూపం, పసుపు అమ్మవారికి ప్రతిరూపం అంటారు కదా..ఈ కుంకుమతో నా విజయాన్ని రిషి సార్ కి అంకితం చేస్తున్నా అనుకుంటుంది. రిషి సార్ కి ఎలాగైనా నాపై కోపం పోయేలా నువ్వే చాడాలి అనుకుంటుంది..ఇంతలో రిషి కార్ వెళ్లిన హారన్ వినిపిస్తుంది. అంటే వచ్చి వెళ్లారా అనుకుంటుంది.


అటు ఇంట్లో అంతా వసుధార విజయం గురించి బాగా మాట్లాడుకుంటారు. వసుధార ఏ ముహూర్తాన వచ్చిందో కానీ మన కాలేజీకి మంచి పేరొచ్చిందని ఫణీంద్ర అంటే.. అంతా రిషి కృషి అంటుంది జగతి. అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఎంట్రీ ఇస్తుంది దేవయాని. ఏంటీ అందరూ సర్వసభ్య సమావేశం పెట్టారంటే..మీరు లేకుండా ఏ సమావేశం అయినా సంతకం లేని చెక్ లాంటింది అంటాడు గౌతమ్. నేను లేకుండానే ఏదో డిసైడ్ చేస్తున్నారు కదా అన్న దేవయానితో..వసుధారకి అభినందన సభ పెడదామని ఆలోచిస్తున్నాం అంటాడు ఫణీంద్ర. అయితే వైభవంగా ఏర్పాటు చేయండని దేవయాని సెటైర్ వేస్తే సరే..భలే చెప్పావ్ దేవయానీ నువ్వు చెప్పింది మేం ఎందుకు కాదనాలి అంటూ సరే అలాగే చేద్దాం అంటాడు ఫణీంద్ర. ఎంతకాదన్నా మీ పెద్దమ్మది చాలా పెద్దమనసు ఏదీ చిన్నగా ఆలోచించరు అని జగతి రివర్స్ సెటైర్ వేస్తుంది. అందరూ వసుధార భజన చేస్తున్నారే కానీ రిషి గురించి ఒక్కరైనా ఆలోచిస్తున్నారా రిషి ఇంకా ఇంటికి రాలేదు మీకెవరకీ పట్టదా అంటుంది. ఇంతలో రిషి రావడంతో నువ్వెక్కడి వెళ్లావో అని కంగారు పడ్డాను అంటుంది దేవయాని. 


Also Read: అమ్మవారి సాక్షిగా మనసులో ప్రేమను బయటపెట్టిన రిషి, వసు-బంధం బలపడుతోంది


ఏరా గుడికి వెళ్లావా పిలిస్తే నేను వచ్చేవాడిని కదా అని గౌతమ్ అంటే...ఒకరు పిలిస్తే కాదు మనకంటూ ఓ అభిప్రాయం ఉండాలి కదా అంటాడు రిషి. వసుధార గురించి గౌతమ్ ఏదో మాట్లాడబోతుంటే నువ్వాగు అని గౌతమ్ ని ఆపేసి రిషిని పంపించేస్తుంది దేవయాని. ఇంతలో గౌతమ్ కి కాల్ వస్తే అక్కడి నుంచి లేచివచ్చిన గౌతమ్... వసుధార అభినందన సభ గ్రాండ్ గా చేద్దామంటున్నారు పెదనాన్న అని రిషికి చెబుతాడు. వెనుకే వచ్చిన దేవయాని ఇంట్లో తన పేరు మాట్లాడొద్దు ఇక్కడి నుంచి వెళ్లు అంటుంది. 
దేవయాని: ఒక్కరికి కూడా నీపై ప్రేమ లేదు..అందరూ వసుధార గురించే మాట్లాడుతున్నారు. తనేదో సాధించింది అంటున్నారు కానీ అంతా నీ గొప్పతనమే కదా...ఈ మాత్రం దానికే సభలు సన్మానాలు అవసరమా
రిషి: వసుధారని సన్మానించడం తప్పేముంది...ఇందులో ఎలాంటి మార్పు లేదు పెద్దమ్మా...
రిషి..ఈ మధ్య నా మాటల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు జాగ్రత్తపడకపోతే మొత్తానికి చేయి జారిపోయేలా ఉన్నాడు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవయాని. 
అటు తన రూమ్ బయట పిల్లలకు ఆవకాయ అన్న కలిపి చేతిలో పెడుతూ ఆవగాయ గురించి చిన్న క్లాస్ వేస్తుంది. పక్కనే కూర్చుని రిషి అడుగుతున్నట్టు ఊహించుకుంటుంది. అదే సమయంలో రిషి అక్కడ వసుగురించి ఆలోచిస్తాడు
రిషి: వసుధార గెలవడం ఆశ్చర్యం ఏముంది..నన్ను ఓడించడం ఆశ్చర్యం అనుకుంటాడు. వద్దంటూనే తన గురించి ఆలోచిస్తుంటాను, తను నా బలహీనత అయిందా, తన గురించి నేను ఇక ఆలోచించను. స్కాలర్ షిప్ టెస్టుల విజయానికి పొంగిపోతూ భోజనం చేయడం మానేసిందా...కాల్ చేసి అడుగుదాం...అయినా నాకెందుకులే తనగురించి ఆలోచించొద్దు అనుకున్నా కదా...


Also Read: మై లవ్ ఈజ్ గాన్ అంటున్న రిషి, ఫీల్ మై లవ్ అంటోన్న వసు - ఆకట్టుకుంటోన్న రిషిధార ప్రేమ ప్రయాణం


పొద్దున్నే రిషి-గౌతమ్-ధరణి ముగ్గురూ వసు రూమ్ దగ్గరకు వస్తారు. వసుధార ఇక్కడ ఉంటోందా అని ధరణి బాధపడుతుంది. గౌతమ్ వెళ్లి డోర్ కొడతాడు...లోపల లేదని తెలిసి బయట వెయిట్ చేయాలి అనుకుంటారు. ఇంతలో నీళ్లబిందె పట్టుకుని వస్తుంది వసుధార. 
రిషి: తనెవరో చూడు వసుధారలా ఉంది కదా
గౌతమ్: నీ మోహం ....వచ్చేది వసుధారే 
రిషి: ఎందుకొచ్చాం..ఏం చూస్తున్నాం...
ధరణి: స్కాలర్ షిప్ టెస్టులో టాప్ ర్యాంక్ వచ్చినందుకు అభినందించేందుకు వచ్చిన మనం వసుని ఇలా చూస్తాం అనుకోలేదు...
గౌతమ్: బరువు మోస్తోంది కదా వెళ్లి పట్టుకోవచ్చు కదా
రిషి: మన బరువు బాధ్యత మనమో మోయాలి


రిషి కారు వెళ్లిపోతుండగా వసు కారు వెనుకే పరిగెడుతుంది... ప్రోగ్రాం మొదలవుతోంది కదా ఇప్పుడు వెళ్లిపోతున్నారేంటి అనుకుంటుంది. రిషి సార్ రారని నా మనసు చెబుతోంది మేడం అంటుంది. నీ మనసేంటో నీకు స్పష్టత ఉందా అన్న జగతితో ఈ మధ్యే క్లారిటీ వచ్చింది అని రిప్లై ఇస్తుంది వసుధార.