గుప్పెడంతమనసు జూన్ 28 ఎపిసోడ్ (Guppedantha Manasu June 28 Episode 488)


వసు, రిషి ఇద్దరూ మినిస్టర్ ని కలిసి వెళుతూ దార్లో ఆగి ఫ్రూట్స్ తింటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతారు. 
మరోవైపు జగతి తనలో తానే నవ్వుకుంటుంది. ఏంటి మేడం మీరే నవ్వుకుంటున్నారు మాక్కూడా చెప్పండి అంటాడు మహేంద్ర. ఏం లేదు మహేంద్ర వాళ్లిద్దరూ కలసి ఉంటున్నారు. అదే ఆనందంగా ఉందంటుంది. 
మహేంద్ర: ఆనందపడకు జగతి..మన రిషి దేన్నీ అంత తేలిగ్గా దేన్నీ మర్చిపోడు. నీ  విషయమే చూసుకుంటే ఆ కోపాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాడు కదా...
జగతి: అవును మహేంద్ర నేనే పిచ్చిదాన్ని...మనసు మార్చుకుంటాడేమో, నాపై ప్రేమ కలుగుతుందేమో అని ఆశపడుతూ ఎదురుచూస్తున్నాను. అమ్మను కదా నా గుండెకు చేసిన గాయాన్ని మర్చిపోగలను, తను బావుంటే చాలనుకుంటాను... అని ఎమోషన్ అవుతుంది..
మహేంద్ర: నిజం చెప్పాలనే ప్రయత్నించాను కానీ నిన్ను బాధపెట్టాలని కాదు
జగతి: నిజం ఎప్పుడైనా బాధపెట్టేదే అవుతుంది
మహేంద్ర: నువ్వు అనుకున్నది తీరకపోదే మరింత బాధపడతావని చెప్పాను
జగతి: రిషి నన్ను అమ్మా అని పిలుస్తాడన్నది ఎప్పటికీ నెరవేరదు. నా బాధను పక్కనపెట్టేస్తే కనీసం వాళ్లిద్దరూ అయినా కలిస్తే బావుంటుంది కదా... అనేసి వెళ్లిపోతుంది...


Also Read: ప్రేమిస్తే జీవితాన్నిస్తాం, జాలిపడితే సాయం చేస్తాం- సౌందర్యఆనందరావుని బయటకు గెంటేసిన జ్వాల


రూమ్ లో ఉన్న వసుధార... ప్రేమలేఖ, గీసిచ్చిన బొమ్మను చూసి మురిసిపోతుంటుంది. 
వసుధార: మీకు ఇంత అందంగా ప్రేమలేఖ రాయడం వచ్చా...అన్నీ బావుంటాయి కానీ మీ కోపమే విచిత్రమైనది. అయినా మీ కోపం కూడా ఈ మధ్య నాకు నచ్చుతోంది. ఈ మధ్య మీరేం చేసినా నచ్చుతోంది...తిడితే కోపం అస్సలు రావడం లేదు. ఏంటీ మాయ.. ఆ మాయేనా ....ఏంటీ రిషి సార్ నా చేతుల్లోంచి జారిపోవాలని చూస్తున్నారా..మిమ్మల్ని నేను పోనివ్వను కదా ...ఈ ప్రేమ లేఖలో ఏముందో తెలియదు కానీ ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటుంది. రిషి సార్ కి కాల్ చేస్తే అనుకుంటూ కాల్ చేస్తుంది...
రిషి: ఆ కాల్ కట్ చేసి వెనక్కు తిరగ్గానే ఎదురుగా వసుధార కనిపిస్తుంది....ఏంటి కాల్ కట్ చేస్తారు, ఇది కరెక్ట్ కాదు కదా ఏంటి చూస్తున్నారు సమాధానం చెప్పండి అని అడిగినట్టు అనిపిస్తుంది. 
నా ప్రేమ నీకు భయం కలిగిస్తోంది అన్నావ్ కదా,నీ ఫోన్ అటెండ్ చేయాలంటే నాక్కూడా భయం వేస్తోందా... బంధం లేదన్నావ్, ప్రేమ కాదన్నావ్, క్లారిటీ లేదన్నావ్...ఇవన్నీ మర్చిపోయిన ఎప్పటిలా ఎలా కలసిపోగలను, ఎప్పటిలా ఎలా మాట్లాడగలను. నేను క్లారిటీగా ఉన్నాను నువ్వే క్లారిటీగా లేవు , నా మనసేంటో నాకు తెలిసింది, నీ మనసే నీకు అబద్ధాన్ని చెప్పింది. ఆ అబద్ధం నువ్వు నాకు చెప్పావ్ అనుకుంటాడు. మళ్లీ వసు నుంచి కాల్ రావడం చూసి స్విచ్చాఫ్ చేస్తాడు. 
వసుధార: మీరు ఫోన్ మాత్రమే ఆఫ్ చేసి పెట్టుకోగలరు...మనసుని కాదు..ప్రతి ప్రయాణంలో విరామం ఉంటుంది..మనకూ అదే జరిగింది.. మళ్లీ వసంతం కోసం ఎదురుచూస్తుంటా అనుకుంటుంది.


Also Read: మై లవ్ ఈజ్ గాన్ అంటున్న రిషి, ఫీల్ మై లవ్ అంటోన్న వసు - ఆకట్టుకుంటోన్న రిషిధార ప్రేమ ప్రయాణం
కాలేజీలో కారు దిగి లోపలకు వెళుతుండగా రిషికి కాల్ వస్తుంది. అవునా థ్యాంక్యూ అంటాడు. రియల్లీ గ్రేట్ వసుధార, స్కాలర్ షిప్ టెస్టులో వసుధార టాప్ అని మురిసిపోతాడు.  వసుధార కంగ్రాట్స్ అని చేయి పట్టుకుని సంతోషంగా చెబుతాడు. దేనికి సార్ అని వసు అంటే...స్కాలర్ షిప్ టెస్టులో వసు టాప్ లో ఉందంట అని చెబుతాడు. ఎన్ని మార్కులు అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు, ఇప్పుడే కాల్ వచ్చిందంటాడు. నువ్వు మొత్తానికి సాధించావ్ కంగ్రాట్ర్స్ అంటాడు రిషి. వసుధార సంతోషంగా షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇదంతా మీ హెల్ప్ వల్లే అయింది..అంతా మీ పుణ్యమే సార్ , ఆ రోజు మీరు నాకు అడుగడుగునా వెంటే ఉన్నారు అంటుంది. మళ్లీ రిషికి తాను రిజెక్ట్ అయిన విషయం గుర్తొచ్చి చేయి చప్పున వదిలేసి వెళ్లిపోతాడు. క్యాబిన్లో కూర్చుని వసు మాటలే గుర్తుచేసుకుంటాడు. నువ్వు పాస్ అయ్యావ్, నన్ను ఫెయిల్ చేశావ్ వసుధార అని బాధపడతాడు. అటు వసుధార కూడా కాలేజీ మెట్లపై కూర్చుని ...స్కాలర్ షిప్ టెస్టులో పాసయ్యాను, రిషి సార్ తో లైఫ్ లో ఫెయిలయ్యాను అనుకుంటుంది. 


అటు స్టాఫ్ అంతా సంతోషంగా ఉంటారు. వసు గురించి అంతా జగతిని పొగుడుతారు. ఒకప్పుడు వసుధార నా స్టూడెంట్ కానీ ఇప్పుడు రిషి సార్ స్టూడెంట్. తను గెలిచినా ఓడినా అన్నీ రిషికే చెందుతాయి. రిషి సార్ వసుపై స్పెషల్ కేర్ తీసుకున్నాడని మహేంద్ర అంటాడు. ఇదంతా విన్న రిషి...నేను గెలిచి ఓడానా, ఓడిపోయిన గెలిచానా అనుకుంటూ వెళ్లిపోతాడు రిషి. కాలేజీ నుంచి రిషి వెళ్లిపోవడం చూసిన వసుధార...ముందు స్వీట్ రిషి సార్ కే ఇవ్వాలి అనుకుంటుంది. 


మహేంద్ర మన కాలేజీకి శుభవార్త అంటూ లోపలకు వస్తుంది జగతి. 
జగతి: మంత్రి గారు మన వసు స్కాలర్ షిప్ పరీక్షలో సాధించిన విజయానికి అభినందించారు... ఇలాంటి విజయాన్ని ఊరికే శుభాకంక్షలు చెప్పి వదిలెయొద్దు అన్నారు
మహేంద్ర: కొంపతీసి సన్మాన కార్యక్రమాలున్నాయా ఏంటి
జగతి: నన్ను చెప్పనీ మహేంద్ర..వసు సాధించిన విజయం సందర్భంగా ప్రభుత్వం తరపున అభినందనగా ఓ సామాజిక కార్యక్రమం చేద్దాం అన్నారు...
మహేంద్ర: అవన్నీ కూడా నువ్వే చేయాలి కదా... నువ్వేం చేసినా కానీ వసు,రిషిలు ఓ పది రోజుల పాటూ క్యాంప్ వెళ్లేట్టు ప్లాన్ చేయిు, దూరంగా పంపిస్తే అయినా దూరం అయిన మనసులు దగ్గరవుతాయి
జగతి: అభిప్రాయాలు,అభిమానాలు చిగిరిస్తే చాలు...మోడువారిన చెట్టు చిగురించినట్టే...


అటు రిషి అమ్మవారి గుడి దగ్గరకు వెళతాడు
రిషి:  అమ్మా నువ్వు నా మాట వింటావ్, నా మనసు తెలుసుకుంటావ్ గతంలో ఓసారి నీ దగ్గరకు వచ్చి నా మనసులో బాధ చెప్పుకున్నాను ( గతంలో వసుకి జ్వరం తగ్గాలని కోరుకుంటాడు). తన మనసులో ఏముందో తెలియదు కానీ ఏదో చెప్పేసింది, నేను లేను అనేసింది కానీ నాకేం తెలియకపోవచ్చు కానీ నీకు అన్నీ తెలుసు..గంపంత కళ్లతో అన్నీ చూస్తుంటావ్ అంటారు.. ఏం చేయాలని ఉందో నువ్వే చేసేసెయ్  నేను అడగలేను నా మనసేంటో నీకు తెలుసు అంటాడు


రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
తనని నువ్వే కాపాడాలి...తనని నువ్వే నడిపించాలంటూ  వసుధార పేరు పసుపుతో రాస్తాడు రిషి. మరోవైపు వసుధార కూడా అదే అమ్మవారికి మొక్కుకుని ... రిషి సార్ లేకపోతే నేను లేను నా విజయం లేదంటూ కుంకుమతో రిషి పేరు రాస్తుంది..


Also Read:  నీ దూరం భరించలేను-దగ్గరకొస్తే సహించలేనన్న రిషి, జీవితకాలం మీతో ప్రయాణిస్తానన్న వసు- ప్రేమ వెన్నెల కురుస్తోంది!