Karthika Deepam  జూన్ 28 మంగళవారం ఎపిసోడ్ 


జ్వాల( శౌర్య) నిద్రపోతుండగా ఇంట్లో పనులన్నీ చేస్తుంది సౌందర్య. నేనెవరో తెలిసే నానమ్మ ఇదంతా చేస్తోందా అనుకుంటుంది. ఇంతలో సౌందర్య ఓ కవర్ జ్వాల చేతిలో పెడుతుంది. అది చూసి షాక్ అవుతుంది. ( నిరుపమ్ బొమ్మ చించేస్తుంది జ్వాల.. ఆ బొమ్మని అతికించి ఇస్తుంది సౌందర్య)
జ్వాల: ఆ తింగరి ముందు అమాయకురాలిలా ఉండేది..అన్నిటికీ భయపడేది. నేను మనస్ఫూర్తిగా డాక్టర్ సాబ్ చెప్పాడని ప్రేమగా నాతో తిప్పుకున్నాను, మార్చాను, అవును మారింది..నన్ను మోసం చేసేంత గొప్పగా మారింది. ఆ తింగరిని క్షమించేది లేదు..ఈ జ్వాల ప్రేమించినా, ద్వేషించినా విపరీతంగానే ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మా అమ్మా నాన్నని పొట్టన పెట్టుకున్న శత్రువు కన్నా ఆ తింగరి చేసిన మోసం చాలా ఎక్కువ...
సౌందర్య: ఏం చేస్తావే..
జ్వాల: ఏమైనా చేస్తాను..నా ప్రేమను  లాగేసుకుంది, నా జీవితాన్ని, డాక్టర్ సాబ్ ని నా నుంచి దూరం చేసింది...క్షమించను అంటుంది..
సౌందర్య: జ్వాలలో ఆవేశం చూసి ఏమీ మాట్లాడకుండా చూస్తూ నిల్చుండిపోతుంది


మరోవైపు శోభను కలసిన హిమ లాగిపెట్టి కొడుతుంది...
హిమ: ఇంకోసారి నా పేరుతో జ్వాలకి కాల్ చేసి ఇబ్బంది పెడితే నేను మా బావ దగ్గరకు వెళ్లి నిజం చేప్పేస్తాను. అప్పుడు నీకు చిన్న ఆశ కూడా ఉండదు. స్వప్నత్త కూడా నిన్ను కాపాడలేదు..జాగ్రత్త అంటుంది. 
వద్దు హిమా వద్దు హిమా అని అరుస్తూ లేస్తుంది.... ( ఇదంతా శోభ కలగంటుంది)


Also Read: శోభకు చెక్ పెట్టేందుకు హిమ మాస్టర్ ప్లాన్, జ్వాల సెల్ఫ్ రెస్పెక్ట్ చూసి షాక్ అయిన డాక్టర్ సాబ్


సౌందర్య: నీ ప్రేమకు పెద్దరికం చేయమంటావా
జ్వాల: నువ్వేం చేస్తావు సీసీ..పెళ్లికి పెద్దరికం చేయొచ్చు కానీ ప్రేమకు చేం చేస్తావ్. 
సౌందర్య: నీ నెయిల్ పాలిష్ బావుంది..నీ చేతికి గోరింట పెట్టనా
జ్వాల: నన్ను పెళ్లికూతుర్ని చేయాలని తహతహలాడుతున్నట్టున్నావ్
సౌందర్య: అన్నీ కలిసొస్తే నేనే నిన్ను పెళ్లికూతుర్ని చేస్తానేమో...
జ్వాల: ఆ అదృష్టం లేదులే...
సాయంత్రం యంగ్ మెన్ ని తీసుకొస్తాను ఎక్కడికీ వెళ్లకు అనేసి వెళ్లిపోతుంది సౌందర్య....
చేతిలో ఉన్న నిరుపమ్ బొమ్మ చూస్తూ మళ్లీ నేను నిన్ను ప్రేమించడం లేదన్న నిరుపమ్ మాటలు గుర్తుచేసుకుని ఫ్రస్ట్రేట్ అవుతుంది....


Also Read: మై లవ్ ఈజ్ గాన్ అంటున్న రిషి, ఫీల్ మై లవ్ అంటోన్న వసు - ఆకట్టుకుంటోన్న రిషిధార ప్రేమ ప్రయాణం


మరోవైపు నిరపమ్ , స్వప్న కార్లో వెళుతూ... హిమ ఎందుకు ఆనందంగా లేదని నిరుపమ్, మమ్మీ ఎక్కడికి వెళ్లినట్టు అని స్వప్న ఆలోచించుకుంటారు. ఇంతలో ఇంటిముందు అడ్డంగా ఆటో పెట్టి ఉంటుంది. ఇది మనింటికి వచ్చిందా దీనికెంత ధైర్యం అని కోపంగా కారు దిగుతుంది స్వప్న. నిరుపమ్ ని చూసి గతంలో జరిగినవన్నీ గుర్తుచేసుకుంటుంది జ్వాల...
స్వప్న: ఏయ్...ఏంటే ఆటో తీసుకొచ్చి ఏకంగా ఇంటిముందు పెట్టావ్
నిరుపమ్: ఏంటి జ్వాలా ఇలా వచ్చావ్
స్వప్న: నివ్వింకా కుశలమా ఏంటి సంగతులు అని అడుగు...నువ్వు మెత్తగా ఉన్నావ్ కాబట్టే ఇలాంటి వాళ్లంతా నెత్తికెక్కి కూర్చుంటున్నారు. వెళ్లమని చెప్పు
జ్వాల: మీతో వెళ్లమని చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని లెక్కలు తేల్చుకునేందుకు వచ్చాను
నిరుపమ్: ఏంటి జ్వాలా
స్వప్న: ఏయ్ ఆటో తియ్...
జ్వాల: లెక్కలు తేల్చుకోవాల్సింది మీతో కాదని చెప్పాను కదా...ఎందుకు ఎక్కువ చేస్తున్నారు
స్వప్న: లాగి పెట్టి కొడుతుంది
జ్వాల: చెంపమీద కొట్టినదానికన్నా మనసుమీద కొట్టిందే నొప్పి ఎక్కువ డాక్టర్ సాబ్ అంటూనే..మరోసారి చేయి ఎత్తితే మర్యాదగా ఉండదు.
నిరుపమ్ చేతిలో ఆటో కీ పెట్టిన జ్వాల...ఇది మీరు కొనిచ్చిన ఆటోనే...ఇంకా నేను ఈ ఆటోలేనే తిరిగితే చాలా ఛండాలంగా ఉంటుంది, జ్వాల అన్న పేరుకి అసలు అర్థమే లేకుండా పోతుంది. 
నిరుపమ్: నేను ఏదో అన్నాననే కదా ఆటోతిరిగి ఇస్తున్నావ్
స్వప్న: ఇంటి ముందు ఆటో పెడితే మేమేం చేయాలి...
జ్వాల: ఉంచుకుంటారో, ఊరేగుతారో నాకు అనవసరం, కాల్చేయడం మీకు అలవాటే కదా
స్వప్న: ఇలాంటి అలగా జనంతో మీకేంటి...
జ్వాల: అలగా అయి ఉంటే ఆటో తిరిగి ఇచ్చేదాన్ని కాదు... కొట్టినా ఆగాను కానీ...అలగా అంటే మాత్రం ఊరుకునేది లేదు
నిరుపమ్: ఆటో తిరిగి ఇవ్వడం అవసరమా
జ్వాల: మన అనుకుని సాయం చేశారనుకున్నాను కానీ పరాయిదాన్ని అని మొహంమీదే చెప్పారు... మీ సహాయానికి, సానుభూతికి నమస్కారం 
అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్వాల...ఇంతలో శుభలేక ఇచ్చేందుకు నిరుపమ్ పిలుస్తాడు కానీ జ్వాల వెనక్కు తిరిగి చూడకుండా వెళ్లిపోతుంది. 
స్వప్న: నువ్వు హిమపై ప్రేమతో పెళ్లిచేసుకుంటున్నావా...జాలితో చేసుకుంటున్నావా
నిరుపమ్: ప్రేమిస్తే జీవితాన్ని ఇస్తాం, జాలిపడితే డబ్బిస్తాం... హిమపై ప్రేమ, జ్వాలపై జాలి ఉంది...


Also Read: శోభ చెంప చెళ్లుమనిపించిన సౌందర్య, అటు డాక్టర్ సాబ్ తో లెక్కలు తేల్చుకుంటున్న రౌడీ బేబీ


స్వప్న ఇంటి ముందు కారు ఆపిన శోభ...ఇంటిముందు ఆటో చూసి షాక్ అవుతుంది. ఈ జ్వాల ఏకంగా ఇంటికే వచ్చిందంటే ఏం కొంపముంచుతుందో ఏమో అనుకుంటూ లోపలకు వెళుతుంది. స్వప్న-నిరుపమ్ ఇద్దరూ కూర్చుని వెడ్డింగ్ కార్డులు ఎవరెవరికి ఇవ్వాలన్న లిస్ట్ రాసుకుంటారు.  లోపలకు వచ్చి కూర్చున్న శోభ మాత్రం లోపల జ్వాల లేదేంటని వెతుకుతుంటుంది..
ఎపిసోడ్ ముగిసింది


రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
నీ పర్మిషన్ లేకుండా ఓ పనిచేశాం...తింగరికి తీసుకొచ్చాం అని చెబుతారు సౌందర్య, ఆనందరావు.  ఏ మొహం పెట్టుకుని వచ్చావే అంటూ హిమ మెడపట్టుకుని బయటకు గంటేసిన జ్వాల...మీరెవ్వరూ మళ్లీ రావొద్దు నా బతుకు నన్ను బతకనీయండి అని డోర్ వేసేస్తుంది.