గుప్పెడంతమనసు జూన్ 25 ఎపిసోడ్ (Guppedantha Manasu June 25 Episode 486)


రిషి దగ్గర సాక్షి గురించి మాట్లాడిన దేవయానికి స్వీట్ వార్నింగ్ ఇస్తాడు రిషి. తినే కంచంలో చేయి కడిగేసుకుని కొడుకు వెళ్లిపోవడంతో మహేంద్ర కూడా తినడం ఆపేస్తాడు. 
మహేంద్ర: వదినా ఒకసారి రెండు సార్లు మాత్రమే చేపలు గాలానికి చిక్కుతాయి అది ఎప్పటికీ జరగదు. సాక్షిని ఇంటికి తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు అది జరగదు
జగతి: సాక్షిని ఇంటికి తీసుకొచ్చినా మేం అడ్డుకుంటాం...నా కొడుకుని కడుపునిండా తినకుండా చేశారు..థ్యాంక్స్...
 ఇలాంటి రియాక్షన్స్ ఊహించని దేవయాని షాక్ అవుతుంది
మరోవైపు లిఫ్ట్ ఇచ్చిన విషయం గుర్తుచేసుకుని మురిసిపోయిన వసుధార...నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ అని మెసేజ్ చేస్తుంది.  ఆ మెసేజ్ చూసిన రిషి...
రిషి: నువ్వు దూరంగా ఉండే భరించలేను, దగ్గరకు వస్తే సహించలేను. ఎదురుగా వస్తే చూడలేను చూడకుండా ఉండలేను, నీపై కోపం ప్రేమ రెండూ తగ్గడం లేదు...ఏంటీ పరిస్థితి  అనుకుంటూ వసు పరిచయం అయినప్పటి నుంచీ జరిగినవన్నీ గుర్తుచేసుకుంటాడు. నువ్వు నడిచి వెళుతుంటే నా గుండె పగిలినచప్పుడు నాకే వినిపించినట్టైంది తెలుసా..ఈ బాధ నేను తట్టుకోగలనా అనిపించింది. కానీ అన్నింటినీ ఫేస్చేస్తాను..నిన్ను కూడా ఫేస్ చేస్తాను..
వసు: సైకిల్ ని చూస్తూ నువ్వుటైమ్ కి మొరాయించావని తిట్టుకున్నాను కానీ టైమ్ కి రిషి సార్ తో కలసి ప్రయాణించాను... కార్లోనే ప్రయాణం బావుంటే ఇక జీవితాంతం ప్రయాణిస్తేఎంత బావుంటుందో.. మీరు అందమైన అవకాశం ఇస్తే కాదనుకున్నాను...ఇప్పుడు ఆకాశానికి వినిపించేలా sorry చెప్పాలా అనుకుంటూ మళ్లీ మెసేజ్ చేస్తుంది. మీరు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాను మీరు రిప్లై ఇవ్వలేదని
రిషి: నీ ప్లేస్ లో ఎవ్వరున్నా నేను అదే చేస్తాను
వసు: ప్రపంచంలో కొన్నింటి ప్లేస్ లను రీప్లేస్ చేయలేం...నా ప్లేస్ ఏంటో నాకు తెలుసు...
రిషి: ఈ మెసేజ్ కి అర్థం ఏంటి అనుకుంటూ గుండెపై చేయి వేసుకుంటాడు రిషి


Also Read: శోభ చెంప చెళ్లుమనిపించిన సౌందర్య, అటు డాక్టర్ సాబ్ తో లెక్కలు తేల్చుకుంటున్న రౌడీ బేబీ


కాలేజీలో రిషి కనిపించగానే వసు గబగబా మాట్లాడేస్తుంది వసుధార
వసు: మీరు నాతో ఎప్పటిలా మాట్లాడడం లేదు, కోపం ఉంటేడైరెక్ట్ గా తిట్టండి...
రిషి: వసుధారా నాకు పని ఉంది బై అనేసి వెళ్లిపోతాడు
వసు: ఏదో మనసులో పెట్టుకుని ఇంకోలా మాట్లాడడం సరికాదు..
అప్పుడే కాలేజీ బయట కారు ఆపిన మహేంద్ర...వసుధార అనకుండా రిషిధార కనిపించడం లేదేంటి జగతి అంటాడు. ఆ మాట వినేసిన రిషి..ఏం మాట్లాడుతున్నారని క్వశ్చన్ చేస్తాడు. 
రిషి: మీరు అవసరం అయినదానికన్నా ఎక్కువ ఆలోచిస్తున్నారు
మహేంద్ర: నువ్వే ఎక్కువ ఆలోచించి మళ్లీ నన్ను అంటావా
రిషి: మీ స్టూడెంట్ కి ఓ మాట చెప్పండి
జగతి: రమ్య, షీలా, పుష్ప అంటూ కాసేపు ఆటపట్టించి అప్పుడు వసుగురించా నాకు చెబుతోంది అంటుంది
రిషి: తను ఈ మధ్య తన జీవిత లక్ష్యాన్ని పట్టించుకున్నట్టు లేదు..ఆ విషయం చెప్పండి
మహేంద్ర: అంతేనా రిషి...ఇంకేమైనా చెప్పాలా గుర్తుచేసుకోండి
రిషి: స్లమ్ విజిట్ కి సైకిల్ పై వెళ్లాలా...అనవసరమైన సాహసాలు చేయొద్దని చెప్పండి..అనేసి వెళ్లిపోతాడు
మహేంద్ర: దీని భావం ఏంటి జగతి మేడం 
జగతి: నీకింకా అర్థంకాలేదా...
మహేంద్ర: రాత్రి మన పుత్రరత్నం,నీ స్టూడెంట్ మాణిక్యం కలిశారా...ఆయన ఏం చెప్పాలనుకున్నారో మనద్వారా చెప్పించారా
జగతి: అనవసరంగా నువ్వే రిషికి అవకాశం ఇచ్చావ్
మహేంద్ర: రిషిధార అనడం తప్పంటావా...
జగతి: వసు sorry చెప్పాలి, రిషికోపం తగ్గించుకోవాలి..అప్పుడు ఇద్దరి ఆలోచనలు సమన్వయంగా ఉంటాయని నా ఆలోచన
ఇంతలో వసుధార అక్కడకు వస్తుంది... 
జగతి: ప్రాజెక్టుకి సంబంధించిన డీటేల్స్ పూర్తిచేస్తావా
వసు; మెయిల్ పెట్టమంటారా
జగతి: రిషి సార్ కి వివరంగా చెప్పు...మినిస్టర్ గారికి డైరెక్ట్ గా పంపిస్తే బావోదు. ఈ పని ఎవ్వరికీ అప్పగించదు, పని చేస్తున్నందుకు నీకు నాకు జీతం ఇస్తున్నారు
వసు: కానీ ...రిషి సార్..
జగతి: పై అధికారులు ఒక్కోసారి కోపంగా ఉంటారు..వాళ్ల ఎమోషన్ బట్టి మనం నడుచుకోవాలి...మన ఎండీగారు గురించి నాకేం చెప్పొద్దు...
మహేంద్ర: నువ్వు సింపిల్ గా చెప్పావ్ కానీ వసుకి అర్థమయ్యేలా చెప్పావ్ అనుకుంటాడు


Also Read: ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు-వసు అల్లరికి రిషి ఫిదా, గుప్పెడంత మనసులో మళ్లీ ప్రేమ తుళ్లింత


రిషి-వసు
 ఫైల్ తీసుకుని రిషి సార్ మూడ్ ఎలా ఉందో ఏంటో అనుకుంటూ వెళుతుంటుంది. ఇంతలో కాఫీ తీసుకెళుతున్న ప్యూన్ శివ దగ్గర్నుంచి కాఫీ తీసుకునితీసుకెళుతుంది. వసు వచ్చిన విషయం గమనించకుండా రిషి తన పని తాను చేసుకుని వెళ్లిపోతాడు. వాటర్ ప్లీజ్ అని బాటిల్ తీసుకున్నాక అప్పుడు వసుధారని చూస్తాడు. నువ్వెందుకు తెచ్చావ్ కాఫీ అడిగితే మాట్లాడాలి సార్ అంటుంది. మినిస్టర్ గారు చెప్పిన ప్రోగ్రాం గురించి మీకిది అనేలోగా నా దగ్గర ఉంది నేను చూసుకుంటాను అని కోపంగా మాట్లాడతాడు. రిషి పక్కనున్న షెల్ప్ లో లవ్ సింబల్ బొమ్మ చూస్తూ నిల్చుంటుంది. వెళ్లు అని రిషి సీరియస్ అవడంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 


దేవయాని
ధరణి అని పిలిచిన  దేవయాని ఇంట్లో ధరణి లేనట్టుంది అనుకుంటుంది.  ఇంట్లో తెలియని నిశ్సబ్ధం నన్ను భయపెడుతోంది, మహేంద్ర-జగతి కళ్లలో కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. అది నా ప్రశాంతతని దెబ్బతీస్తోంది. రిషి-వసు మధ్య ఏం జరిగిందో తెలిసి కూడా ఎందుకు ఊరుకున్నారు, రిషికి నో చెప్పిన వసుని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారా...అదే కానీ నిజమైతే నేను జాగ్రత్త పడాల్సి ఉంటుంది. లైబ్రరీలో సాక్షి అంత గొడవ చేసినా సాక్షిని ఎందుకు నిలదీయలేదు... వసుధార రిషిని కాదన్నాక పరిస్థితులు నా అంచనాకు అందకుండా ఉంటున్నాయి. వసుని ఓ కంట కనిపెట్టాలి, ఏ నిర్ణయం తీసుకుని వాళ్లంత ప్రశాంతంగా ఉన్నారో తెలుసుకోవాలి, రిషి కూడా అనుకున్న దానికన్నా హద్దులు దాటుతున్నాడు. సాక్షి రిషిని ఒక్కటి చేయాలి...నా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటూ ఫోన్  చేతిలోకి తీసుకుంటుంది...


సోమవారం ఎపిసోడ్ లో
సార్ మీరెప్పుడైనా మూకీ సినిమాలుచూశారా...మన ప్రయాణం కూడా అలాగే ఉంది సార్ అంటుంది వసుధార. కారు ఓ పక్కన ఆపి రెండు పీస్ లు ఇవ్వు భయ్యా అంటుంది.  ఏంటీ బేరాల్లేవా అని రిషి అంటే డబ్బులు మీరిచ్చేటప్పుడు నేనెందుకు బేరం ఆడడం అంటుంది.  క్లారిటీ బాగానే ఉందంటాడు రిషి.


Also Read: కోపమా నాపైన ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా - వసు దగ్గర బెట్టు చేస్తోన్న రిషి