స్టార్ యాంకర్, ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో 'పేపర్ బాయ్' ఫేమ్ జయ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'అరి'. నో బడీ నోస్... అనేది ఉపశీర్షిక. ఇందులో సాయి కుమార్‌, 'వైవా' హ‌ర్ష‌, 'శుభ‌లేఖ' సుధాక‌ర్ ఇతర ప్రధాన తారాగణం. ఈ రోజు టైటిల్ లోగో విడుదల చేశారు. 


అన్నట్టు... 'అరి' అంటే మీనింగ్ ఏంటో తెలుసా? 'శత్రువు' అని దర్శకుడు జయ శంకర్ చెప్పారు. అరి అనేది సంస్కృత పదం అన్నారు. అనసూయ శత్రువు ఎవరనేది సినిమాలో చూడాలన్నమాట.


'అరి' సినిమా గురించి అనసూయ మాట్లాడుతూ ''లాక్‌డౌన్‌లో జూమ్‌లో ఈ సినిమా క‌థ విన్నాను. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌లో అద్భుత‌మైన కంటెంట్ బేస్డ్ సినిమాలు చూసినప్పుడు... 'మన దగ్గర ఇటువంటివి ఎందుకు రావు?' అనిపించేది. ఈ క‌థ విన్నాక మ‌నమూ అటువంటి సినిమాలు తీయ‌గ‌లమని అనిపించింది. ఇందులో హ్యూమానిటీతో పాటు ఎంట‌ర్‌టైన్‌మెంట్ కూడా వుంది. నా కోసం క్యారెక్టర్లు రాయడం సంతోషంగా ఉంది'' అని చెప్పారు.  మ‌నిషి ఎలా బ‌త‌క‌కూడ‌దో చూపించే చిత్రమిదని నిర్మాతలు చెప్పారు. 


Also Read : 'సమ్మతమే' రివ్యూ: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ఎలా ఉందంటే?


ఈ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి, 'అఖండ' నిర్మాత  మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి, చిత్ర సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, 'ఉప్పెన' ద‌ర్శ‌కుడు సానా బుచ్చిబాబు, మైత్రీ మూవీస్‌ నిర్మాతల్లో ఒకరైన యలమంచిలి ర‌విశంక‌ర్, 'చమ్మక్' చంద్ర, ప్ర‌భాస్ శ్రీ‌ను తదితరులు పాల్గొన్నారు.


Also Read : చోర్ బజార్ సినిమా రివ్యూ: బచ్చన్ సాబ్‌గా ఆకాష్ పూరి మెప్పించాడా? లేదా?