అనసూయ భరద్వాజ్ స్టార్ యాంకర్. ఆమె చాలా బిజీ. ఒకవైపు 'జబర్దస్త్' కామెడీ షోకి యాంకరింగ్ చేస్తున్నారు. మరోవైపు సింగింగ్ రియాలిటీ షో 'సూపర్ సింగర్ జూనియర్'కి హోస్ట్ చేస్తున్నారు. సినిమాలు ఎలాగో ఉన్నాయి. 'పుష్ప' లాంటి సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రధాన పాత్రలో 'అరి', 'దర్జా' లాంటి సినిమాలు చేస్తున్నారు. అందువల్ల, చిన్న చిన్న పాత్రలు వస్తే రిజెక్ట్ చేస్తున్నారు.


అనసూయ చిన్న చిన్న పాత్రలు ఇస్తే చేయదని దర్శకుడు మారుతి ఓపెన్‌గా చెప్పారు. గోపీచంద్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'పక్కా కమర్షియల్' సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ నిమిత్తం 'జబర్దస్త్'కు హీరోతో పాటు వచ్చారు.


''ఒక పక్కా కమర్షియల్ యాంకర్‌ను కలుద్దామని వచ్చాను. అనసూయను చూపిస్తూ... మామూలు కమర్షియల్ కాదు ఈవిడ. చిన్న చిన్న పాత్రలు చేయదు ఇచ్చినా'' అని మారుతి స్టేజి మీద చెప్పారు. అదీ సంగతి!


Also Read : 'సమ్మతమే' రివ్యూ: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ఎలా ఉందంటే?



'పక్కా కమర్షియల్' సినిమాలో అనసూయ ఒక పాత్ర చేసినట్లు తెలుస్తోంది. అంతకు ముందు మారుతి సినిమాల్లో ఏదైనా పాత్ర ఆఫర్స్ రిజెక్ట్ చేశారేమో!? సినిమాలకు వస్తే... త్వరలో 'పుష్ప: ది రైజ్' షూటింగ్ స్టార్ట్ చేయడానికి అనసూయ రెడీ అవుతున్నారు. అది కాకుండా... ఇటీవల 'అరి' టైటిల్ లోగో విడుదల చేశారు. కృష్ణవంశీ 'రంగ మార్తాండ'లో కూడా ఆమె నటిస్తున్నారు. 


Also Read : చోర్ బజార్ సినిమా రివ్యూ: బచ్చన్ సాబ్‌గా ఆకాష్ పూరి మెప్పించాడా? లేదా?