సింగింగ్ కపుల్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారా? వాళ్ళిద్దరూ వేరు పడుతున్నారా? అంటే... 'అవును' అని ప్రచారం జరుగుతోంది. తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో వీళ్ళిద్దరి డివోర్స్ డిస్కషన్ హాట్ హాట్‌గా జరుగుతోంది. అయితే... ఇద్దరూ ఈ విషయం మీద పెదవి విప్పలేదు. రీసెంట్‌గా విడాకుల ప్రచారంపై శ్రావణ భార్గవి పరోక్షంగా స్పందించారు.


''కొన్ని రోజులుగా యూట్యూబ్‌లో నా ఛానల్ వ్యూస్ పెరుగుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫాలోయర్లు పెరుగుతున్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు నాకు ఎక్కువ పని (సాంగ్స్, షోస్, డబ్బింగ్) దొరుకుతోంది. సాధారణంగా నేను సంపాదించే దాని కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. ఇది మంచిదే. తప్పో... ఒప్పో... మీడియా ఒక ఆశీర్వాదం'' అని శ్రావణ భార్గవి పేర్కొన్నారు. 


Hemachandra Reacts On Divorce Rumours: హేమచంద్ర కూడా విడాకుల ప్రచారంపై స్పందించారు. ''నా ఇండిపెండెంట్ సాంగ్స్ కంటే అనవసరమైన, ఏమాత్రం సంబంధం లేని చెత్త సమాచారం చాలా స్పీడుగా స్ప్రెడ్ అవుతుంది'' అని ఆయన పోస్ట్ చేశారు. సోషల్ మీడియా పోస్టుల్లో ఒకరిని ఒకరు ట్యాగ్ చేశారు. 


Also Read : రియల్ లైఫ్ 'మహర్షి'తో రీల్ లైఫ్ మహర్షి -  బిల్ గేట్స్‌తో మహేష్ బాబు భేటీ


హేమచంద్ర, శ్రావణ భార్గవి 2013లో ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె షిఖర చంద్రిక ఉంది. పాటలు, సింగింగ్ రియాలిటీ షోలతో ఇద్దరూ బిజీగా ఉన్నారు.  


Also Read : మగబిడ్డకు జన్మనిచ్చిన 'దిల్' రాజు భార్య తేజస్వి, వారసుడొచ్చాడు