Laal Singh Chaddha: ఆమిర్ ఖాన్ సినిమాలో మెగాస్టార్ ఇన్వాల్వ్మెంట్ - కారణమిదేనా?

ఆమిర్ ఖాన్ చాలా కాలంగా చిరంజీవి అసోసియేషన్ లో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు.

Continues below advertisement

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ను మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. ఈ సినిమా తెలుగు పోస్టర్స్ పై ప్రత్యేకంగా 'మెగాస్టార్ చిరంజీవి సమర్పించు' అంటూ స్పెషల్ గా డిజైన్ చేసి మరీ రాశారు. అసలు ఆమిర్ ఖాన్ సినిమా విషయంలో మెగాస్టార్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారనే అనుమానం చాలా మందిలో ఉంది. 

Continues below advertisement

నిజానికి ఆమిర్ ఖాన్ కి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఆయన స్వయంగా తెలుగులో రిలీజ్ చేసుకునే సత్తా కూడా ఉంది. అదీ కాదంటే.. ఈ సినిమాలో నాగచైతన్య నటించారు కాబట్టి తెలుగులో రిలీజ్ చేయడానికి అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ముందుకొస్తుంది. కానీ స్పెషల్ గా చిరంజీవిని ఈ ప్రాజెక్ట్ లోకి లాగడానికి కొన్ని కారణాలు ఉన్నాయని టాక్. 

ఆమిర్ ఖాన్ చాలా కాలంగా చిరంజీవి అసోసియేషన్ లో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు కుదరలేదు. ఆమిర్ కెరీర్ లో 'లాల్ సింగ్ చద్దా' బహుశా ఆఖరి సినిమా కావొచ్చని.. దీని తరువాత ఆయన సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నారని టాక్. అందుకే చిరంజీవిని తన ఆఖరి సినిమాలో భాగస్వామ్యం కావాలని కోరినట్లు సమాచారం. ఇక చిరంజీవి అయితే తన ట్విట్టర్ లో ఈ సినిమాను తెగ ప్రమోట్ చేస్తున్నారు. రోజూ ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ లు పెడుతూనే ఉన్నారు. 

Also Read: శ్రీనువైట్లకు షాక్ - విడాకులకు అప్లై చేసిన భార్య!

Also Read: రామ్ చరణ్ సినిమాతో శంకర్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా?

Continues below advertisement
Sponsored Links by Taboola