టాలీవుడ్ లో డైరెక్టర్ గా ఎన్నో హిట్టు సినిమాలు తీశారు శ్రీనువైట్ల. ఆయన సినిమాల్లో కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. 'ఆనందం', 'వెంకీ', 'ఢీ', 'దూకుడు' ఇలా బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారాయన. కానీ ఈ మధ్యకాలంలో ఆయనకు ఏ సినిమా కలిసి రావడం లేదు. వరుస ప్లాప్స్ తో ఆయన కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది. భారీ అంచనాల మధ్య విడుదలైన 'అమర్ అక్బర్ ఆంటోనీ' డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఆయన కొన్ని రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. 


అయితే ఇప్పుడు శ్రీనువైట్లకి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన భార్య రూపా వైట్ల విడాకుల కోసం అప్లై చేశారని సమాచారం. ఈ మేరకు నాంపల్లి కోర్టుని ఆశ్రయించినట్లు వినికిడి. గత నాలుగేళ్లుగా శ్రీనువైట్ల, రూపా వేర్వేరుగా ఉంటున్నారని సన్నిహితులు చెప్పుకుంటున్నారు. వీరిద్దరి మధ్య అభిప్రాయబేధాలు రావడంతో ఒకరికొకరు దూరంగా ఉంటున్నారట. 


ఇప్పుడు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రూపా వైట్ల గతంలో శ్రీనువైట్ల డైరెక్ట్ చేసిన సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసింది. భర్త ప్రోత్సాహంతోనే ఆమె ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత 'వేదిక్' అనే పేరుతో సేంద్రియ ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇక శ్రీనువైట్ల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన మంచు విష్ణు హీరోగా 'ఢీ అంటే ఢీ' అనే సినిమాను రూపొందించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వైట్ల చేతిలో ప్రస్తుతం ఈ ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. 


Also Read: నాగచైతన్య 'థాంక్యూ' సినిమా రన్ టైం ఎంతంటే?


Also Read: కోవిడ్ బారిన పడ్డ హీరోయిన్ - వీడియో వైరల్