'లవ్ స్టోరీ', 'బంగార్రాజు' సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న అక్కినేని నాగచైతన్య ఇప్పుడు 'థ్యాంక్యూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. జూలై 22న ఈ సినిమా రిలీజ్ కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. నిన్ననే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహించారు. 


ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా రన్ టైంను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలు రెండున్నర గంటలకు పైగానే ఉంటున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలంటే మూడు గంటలకు దగ్గరగా ఉంటున్నాయి. కానీ ఒక్కోసారి ఈ రన్ ఎక్కువ ఉండడం వలన ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే 'థాంక్యూ' నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకి క్రిస్పీ రన్ టైంను లాక్ చేశారు. 2 గంటల 9 నిమిషాలతో ఫైనల్ రన్ టైంని ఫిక్స్ చేశారు. ఇప్పటికే సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు క్రిస్పీ రన్ టైంతో సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుందేమో చూడాలి!  


ఈ సినిమాకు బీవీఎస్ రవి కథ అందించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Also Read: రవితేజ ఆన్ డ్యూటీ - మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే ట్రైలర్ వచ్చేసిందిగా


Also Read : మెగా 154 సెట్స్‌లో రవితేజ, వెల్కమ్ చెప్పిన చిరంజీవి - మెగా మాస్ కాంబో షురూ