Varalaxmi Sarathkumar: కోవిడ్ బారిన పడ్డ హీరోయిన్ - వీడియో వైరల్

కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ కోవిడ్ బారిన పడింది. 

Continues below advertisement

కోవిడ్ కారణంగా అన్ని రంగాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. చాలా మందికి కోవిడ్ సోకడంతో ప్రాణాలతో పోరాడాల్సి వచ్చింది. ఈ వైరస్ కారణంగానే కొందరు మరణించారు కూడా. సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు కూడా కోవిడ్ సోకి మరణించారు. వ్యాక్సిన్స్ వేయించుకున్నప్పటికీ.. ఈ వైరస్ ప్రజలను ఎఫెక్ట్ చేస్తూనే ఉంది. సినిమా షూటింగ్స్ మొదలైన తరువాత మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. తాజాగా కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ కోవిడ్ బారిన పడింది. 

Continues below advertisement

ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. కోవిడ్ పాజిటివ్ వచ్చిందని.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. కరోనా సోకిందని చెప్పింది. నటీనటులు సెట్స్ లో మాస్క్ లు ధరించలేదని.. కాబట్టి సినిమా యూనిట్ లో మిగిలిన సభ్యులందరూ మాస్క్ లు ధరించాలని కోరింది. తనను రీసెంట్ గా కలిసిన వారిని చెక్ చేయించుకోమని.. మాస్క్ వేసుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పింది. 

వరలక్ష్మి షేర్ చేసిన ఈ వీడియోపై రియాక్ట్ అయిన రాధికా శరత్ కుమార్ 'వరు జాగ్రత్తగా ఉండు. ఆ దేవుడు నీకు స్ట్రెంగ్త్ ఇవ్వాలని కోరుకుంటున్నాను' అని కామెంట్ చేసింది. ప్రస్తుతం వరలక్ష్మీ కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా నటిస్తోంది. విలన్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో ఆమెకి మంచి పేరొచ్చింది. ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న యశోద ' సినిమాతో పాటు బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమలో కూడా కీలకపాత్రలు పోషిస్తోంది వరలక్ష్మీ. 

Also Read: రవితేజ ఆన్ డ్యూటీ - మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే ట్రైలర్ వచ్చేసిందిగా

Also Read : మెగా 154 సెట్స్‌లో రవితేజ, వెల్కమ్ చెప్పిన చిరంజీవి - మెగా మాస్ కాంబో షురూ

Continues below advertisement
Sponsored Links by Taboola