సింగపూర్ ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించారు. తొలిసారి సింగపూర్ ఓపెన్ టైటిల్ సాధించారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు తన ప్రత్యర్థి వాంగ్ ఝిపై విజయం సాధించి కెరీర్‌లో తొలి సింగపూర్ ఓపెన్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఫైనల్లో 21-19, 11-21, 21-15 తేడాతో ప్రపంచ 11 ర్యాంకర్, చైనా షట్లర్ వాంగ్ ఝిపై విజయం సాధించింది సింధు. తద్వారా భారత్ నుంచి ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్‌గా నిలిచారు. ఈ ఏడాది స్విస్ ఓపెన్, సయ్యద్ మోదీ లాంటి సూపర్ 300 కేటగిరీ టోర్నీలు నెగ్గిన సింధు.. తాజాగా సూపర్ 500 కేటగిరి టైటిల్‌ను అందుకున్నారు.
గేమ్ ప్లాన్ మార్చిన సింధు..
ఒత్తిడిని జయించిన పీవీ సింధు తొలి గేమ్‌ను పోరాడి నెగ్గారు. చివరి నిమిషంలో ప్రత్యర్ధికి అవకాశం ఇవ్వకుండా 21-19తో తొలి గేమ్ సింధు గెలిచారు. ఆపై రెండో గేమ్ లో చైనాకు చెందిన సింధు ప్రత్యర్ధి వాంగ్ ఝి పుంజుకుంది. వరుస పాయింట్లు సాధిస్తూ సింధును ఒత్తిడిలోకి నెట్టింది. అయితే ప్రత్యర్ధి టెక్నిక్, బలాన్ని గమనిస్తున్న సింధు గేమ్ కోల్పోయింది కానీ ఆత్మవిశ్వాసంతో కనిపించింది. మూడో గేమ్‌ను 21-15తో నెగ్గి సింగపూర్ ఓపెన్ ను తన ఖాతాలో వేసుంది సింధు. ఆమె కెరీర్‌లో ఇదే తొలి సింగపూర్ ఓపెన్ టైటిల్ కావడంతో తెలుగు తేజం సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
మూడో భారత ప్లేయర్‌గా రికార్డ్..
గతంలో ఇద్దరు భారత ప్లేయర్లు ప్రతిష్టాత్మక సింగపూర్ ఓపెన్ లో విజేతలుగా నిలిచారు. తాజాగా పీవీ సింధు తన కెరీర్‌లో తొలి సింగపూర్ ఓపెన్‌ను సాధించారు. 2010లో సైనా సెహ్వాల్ భారత్ నుంచి సింగపూర్ ఓపెన్ నెగ్గిన తొలి ప్లేయర్ గా నిలవగా.. 2017లో సాయి ప్రణీత్ మరోసారి భారత్‌ను ప్రతిష్టాత్మక ఓపెన్‌లో విజేతగా నిలిపారు. 2022లో నేడు జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ ఝిపై సింధు అద్భుత ప్రదర్శనతో కెరీర్‌లో ఈ ప్రతిష్టాతక ఓపెన్‌లో సరికొత్త విజేతగా అవతరించారు.
Also Read: Virat Kohli Reply Babar Azam: బాబర్ ఆజామ్ ట్వీట్‌కు వెరైటీగా బదులిచ్చిన కోహ్లీ!
Also Read: IND vs ENG: 1000 రోజులుగా 100 కరవు! ఆడుతోంది నిజంగా కోహ్లీయేనా అని డౌటు!!