ఏపీలో టికెట్ రేట్స్, ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 35 గురించి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెజారిటీ ప్రజలు, ముఖ్యంగా పెద్ద సినిమాలు తీసే దర్శక - నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ రేట్స్‌తో సినిమాలు విడుదల చేయలేమని కొందరు అంటే... మరికొందరు నిర్మాతలకు నష్టాలు తప్పవని వ్యాఖ్యానించారు. అగ్ర కథానాయకుడు నాగార్జున 'ఏపీలో టికెట్ రేట్స్‌తో తనకు సమస్య లేదు' అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయ్యింది. 'బంగార్రాజు' విడుదలకు ఒక్క రోజు ముందు ప్రింట్, వెబ్ మీడియాతో సమావేశమైన నాగార్జున, అలా ఎందుకు అన్నదీ వివరించారు.


'ఇండస్ట్రీలో టికెట్ రేట్స్ అనీ, క‌ర్ఫ్యూ అనీ అంటుంటే... మీరు సింపుల్‌గా నాకు ప్రాబ్లమ్ కాద‌ని చెప్పారు!' అని నాగార్జున దగ్గర విషయాన్ని ప్రస్తావించగా... "నాకు ప్రాబ్లమ్ కాదని ఎందుకు చెప్పానంటే... ఏప్రిల్‌లో జీవో నెం 35 వ‌చ్చింది. ఈ టైమ్‌లో సినిమా (బంగార్రాజు) హిట్ అయితే ఇంత కలెక్ట్ చేస్తుంది. మనకు వర్కవుట్ అవుతుందా? లేదా? అని లెక్కలు వేసుకున్నాం. మా అన్నపూర్ణ (స్టూడియోస్ - నిర్మాణ సంస్థ)లో సినిమాలు తీస్తున్నాం. మేం (బడ్జెట్) లెక్కలు వేసుకుంటాం కదా! సినిమాకు ఎంత అవుతుందో మాకు తెలుసు. వాటికి ఎక్కువ బడ్జెట్ వేసి చెప్పేది లేదు. అలాగని తక్కువ చేసేది లేదు. మేం ఎప్పుడూ బడ్జెట్ గురించి చెప్పింది లేదు. ఆ లెక్కలు వేసుకుని... 'బంగార్రాజు'కు వర్కవుట్ అవుతుందని అనుకున్నాం. ఇంకో సినిమాకు, అంతకు ముందు స్టార్ట్ చేసిన సినిమాలకు వర్కవుట్ కాకపోవచ్చు. ఒకవేళ టికెట్ రేట్స్ పెరిగితే మాకు బోనస్. లేదంటే మేం సేఫ్. మరీ సినిమా ఆడకపోతే ఎవరూ ఏం చేయలేరు. అప్పుడు ఏ సినిమా అయినా సేఫ్ అవ్వదు" అని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read: ఏపీలో టికెట్ రేట్స్ పెరిగితే మాకు బోనస్! టికెట్ రేట్స్ తగ్గించిన తర్వాతే... - నాగచైతన్య ఇంటర్వ్యూ
"టికెట్ రేట్స్ కోసం నేను సినిమా రిలీజ్ చేయకుండా ఉంటే... ఆల్రెడీ రెండేళ్లు ఇంట్లో కూర్చుని ఉన్నాం. ఎన్ని రోజులు కూర్చోమంటారు?" అని నాగార్జున సరదాగా అడిగారు. 'బంగార్రాజు' సినిమా స్టార్ట్ చేయడానికి ముందు ఏడాదిన్నర ఇంట్లో ఉన్నానని అన్నారు. లక్కీగా 'బిగ్ బాస్' ఉంది కాబట్టి సరిపోయిందని చెప్పారు. ఏపీలో తొలుత 50 శాతం సీటింగ్ కెపాసిటీ, నైట్ క‌ర్ఫ్యూ విధించినా... సంక్రాంతి వరకూ ఆంక్షలు సడలించారు. ఇది సినిమాకు శుభ సంకేతం అని నాగార్జున భావిస్తున్నారు. పండక్కి అందరూ పల్లెటూళ్లకు వెళుతున్నారు కాబట్టి ప్రభుత్వాలు గుర్తించాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read: ఏపీ సీయం జ‌గ‌న్‌తో చిరంజీవి భేటీ... టికెట్ రేట్స్ గురించి చ‌ర్చిస్తారా?
ఏపీ సీయం జగన్, చిరంజీవి సమావేశం గురించి కూడా నాగార్జున మాట్లాడుతూ "వారం రోజుల క్రితం చిరంజీవిగారు నాకు విషయం చెప్పారు. అపాయింట్‌మెంట్ అడిగాన‌ని అన్నారు. వెళ్లి రమ్మని చెప్పాను. చిరంజీవి గారు అంటే జగన్ బావుంటారు" అని అన్నారు. 


Also Read: త్రివిక్ర‌మ్ గారూ... ఆ సీన్ యూట్యూబ్‌లో రిలీజ్ చేయండి!
Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..
Also Read: తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి