Waltair Veerayya Release Date : మెగాస్టార్ మాస్ మూవీ విడుదల తేదీ ఖరారు - పెద్ద పండక్కి!

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మూడు నాలుగు సినిమాలు చేస్తున్నారు. అందులో ఊర మాస్ మూవీ ఒకటి ఉంది. తెలుగు లోగిళ్లలో పెద్ద పండక్కి ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్.

Continues below advertisement

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కథానాయకుడిగా రెండు మూడు సినిమాలు రూపొందుతున్నాయి. అందులో 'గాడ్ ఫాదర్' ఒకటి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రత్యేక పాత్రలో నటించిన ఆ సినిమా విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అది కాకుండా మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' చేస్తున్నారు. కె.ఎస్. రవీంద్ర దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా మంచి మాస్ మూవీగా రూపొందుతోంది. తెలుగు లోగిళ్లలో పెద్ద పండక్కి ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Continues below advertisement

సంక్రాంతికి మెగాస్టార్ 154 సినిమా!
బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో నటిస్తున్న సినిమా చిరంజీవికి 154వ సినిమా. అందుకని, Mega 154 వర్కింగ్ టైటిల్‌తో చేస్తున్నారు. స్వతహాగా చిరంజీవి అభిమాని అయిన బాబీ... 'పూనకాలు లోడింగ్' అంటూ సినిమాపై మెగా అభిమానులు, ప్రేక్షకులలో అంచనాలు పెంచుతున్నారు. ఆ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు జరిగాయి.

బాలకృష్ణ సినిమా సంక్రాంతికి రావడం లేదట!
నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలని ఆ మధ్య అనుకున్నారు. అప్పుడు చిరంజీవి సినిమా వాయిదా పడొచ్చని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి వినిపించింది. అయితే... రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. రెండూ పోటీ పడితే సంస్థకు నష్టం. అందువల్ల, ఒక సినిమాను సంక్రాంతికి మరొక సినిమాను మరో తేదీకి విడుదల చేసేలా హీరోలను ఒప్పించారని తెలుస్తోంది. సంక్రాంతికి చిరంజీవి సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట.

చిరంజీవి సినిమాలో రవితేజ కూడా... 
మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాలో మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆయన షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ నెల ప్రారంభంలో చివరి షెడ్యూల్ చేశారు. ప్యాచ్ వర్క్ ఏదైనా ఉంటే మళ్ళీ చేయవచ్చు. Mega 154కు 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) టైటిల్ ఖరారు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే... ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 

Also Read : బాయ్‌కాట్‌ ట్రెండ్‌ను తీసి పారేసిన నాగార్జున - వందో సినిమా గురించి ఏం చెప్పారంటే?

చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర దర్శకుడు బాబీ కథ, మాటలు రాయగా... స్క్రీన్‌ప్లే : కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్‌ దేవరమానె, ప్రొడక్షన్‌ డిజైనర్: ఎఎస్‌ ప్రకాష్‌, కాస్ట్యూమ్ డిజైనర్: సుష్మిత కొణిదెల, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం.

Also Read : రెండు రోజులు షూటింగ్ చేసిన తర్వాత హీరోయిన్‌గా నన్ను తీసేశారనుకున్నా - సిద్ధీ ఇద్నాని ఇంటర్వ్యూ

Continues below advertisement