టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో 'ఫలక్ నుమా దాస్', 'ఈ నగరానికి ఏమైంది' వంటి సినిమాలతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. తాజాగా ఈ హీరో నటించిన మరో సినిమా 'పాగల్'. నివేతా పేతురేజ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. 


Also Read : Pawan Kalyan Movie Update: లుంగీ కట్టిన భీమ్లా నాయక్.. ఈసారి మాములుగా ఉండదు మరి..


సినిమా పక్కా హిట్ అని.. అవ్వకపోతే పేరు మార్చుకుంటా అంటూ కాన్ఫిడెంట్ గా విశ్వక్ సేన్ చెప్పడంతో అందరి దృష్టి 'పాగల్'పై పడింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను ఓవర్ సీస్ ఆడియన్స్ ఇప్పటికే చూసేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో సినిమా ఎలా ఉందో చెబుతూ పలు ట్వీట్స్ పెడుతున్నారు. వారి అభిప్రాయాలు ఏంటంటే..? సినిమా ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్ గా ఉందట. 


Also Read : Orey Bamardhi Review: ఒరేయ్ బామ్మ‌ర్ది మూవీ రివ్యూ..


సెకండ్ హాఫ్ ఏవరేజ్ గా ఉందని అంటున్నారు. ఇంటర్వెల్ తరువాత కథను స్లోగా నడిపించారని అభిప్రాయాలు కూడా బాగా వినిపిస్తున్నాయి. చాలా చోట్ల బోర్ కొట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే చివరి ఇరవై నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయని అంటున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు. సినిమాలో కామెడీ కూడా బాగుందట. కొందరు మాత్రం సినిమాపై నెగెటివ్ ట్వీట్స్ కూడా చేస్తున్నారు.