2021 ఆగస్టు 14 శనివారం రాశిఫలాలు
మేషం
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండటానికి ఏకైక మార్గం ఇష్టదైవాన్ని స్మరించుకోవడమే. కోపాన్ని నియంత్రించుకోండి. ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఉద్యోగస్తులు పై అధికారుల వల్ల ఇబ్బంది పడతారు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు.
వృషభం
ఈరోజు మీకు మంచిరోజు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది. విజయం సాధిస్తారు. అందరితో ప్రశంసలందుకుంటారు. జీవిత భాగస్వామి మద్దతు మీకు లభిస్తుంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది.
Also Read: https://telugu.abplive.com/astro/this-zodiac-sign-are-easy-to-win-in-love-people-with-this-zodiac-sign-s-wants-to-enjoy-989/amp
మిథునం
వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యయాన్ని నియంత్రించాలి. రిస్క్ తీసుకోకండి. విద్యార్థులు ఆహ్లాదకరమైన సమాచారాన్ని పొందుతారు. వ్యాపారం బాగా జరుగుతుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొత్త వ్యక్తులను కలుస్తారు. ఎవరితోనైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. రిస్క్ తీసుకోకండి.
కర్కాటక రాశి
ఈ రోజు మంచి రోజు అవుతుంది. వివిధ సమస్యలపై కుటుంబంతో చర్చిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మొండి వైఖరిని వదులుకోవాలి. కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మాటపై సంయమనం పాటించడం అవసరం. కోపం తగ్గించుకోండి. ధన లాభం వచ్చే అవకాశం ఉంది.
Also Read: https://telugu.abplive.com/lifestyle/zodiac-signs-their-thoughts-on-these-constellations-revolve-around-money-and-fall-in-love-with-people-1604/amp
సింహం
ఈ రోజు అద్భుతమైన రోజు అవుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో సహోద్యోగుల పూర్తి మద్దతు ఉంటుంది, పని విజయవంతమవుతుంది. రిస్క్ తీసుకోకండి. పరధ్యానంగా ఉంటారు. మనసులోంచి ప్రతికూల ఆలోచనలు తొలగించండి. అనవసర చర్చలు వద్దు..
కన్య
కన్య రాశివారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. స్నేహితులను కలుస్తారు. కొత్త ప్రణాళికలు వేస్తారు. కార్యాలయంలో శ్రద్ధగా పని చేయండి. బంధువులను కలుస్తారు. అన్ని పనులు విజయవంతమవుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
Also Read: https://telugu.abplive.com/astro/zodiac-signs-5-zodiac-signs-who-are-most-likely-to-have-a-love-marriage-1173/amp
తులారాశి
ఆఫీసులో ఇబ్బందులు ఉండొచ్చు. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గాయపడే ప్రమాదం ఉంది. విద్యార్థులు సంతోషంగా ఉంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. యువతకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు మీరు అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చికరాశి
డబ్బు వ్యవహారాలు సాధారణంగా ఉంటాయి. మీ ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నించండి. మీ పెండింగ్ పనిని ఈరోజు పూర్తి చేయండి. మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. అనవసర ఖర్చులుంటాయి. చట్టపరమైన అడ్డంకులు ఉండొ. బంధువులను కలుసుకోవచ్చు. రిస్క్ తీసుకోకండి.
Also Read: https://telugu.abplive.com/astro/monthly-horoscope-august-2021-aires-pisces-capricorn-zodiac-signs-predictions-lucky-colour-important-days-867/amp
Also Read: https://telugu.abplive.com/astro/children-of-these-zodiac-signs-are-really-intelligent-94/amp
ధనుస్సు
ఈ రోజు మీరు కొంచెం ఎక్కువ ఖర్చు చేస్తారు. విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. ఒత్తిడి తీసుకోకండి. మాట మీద సంయమనం అవసరం. ఎవరితోనైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. రిస్క్ తీసుకోవడం మానుకోండి. ఆఫీసులో వాతావరణం చక్కగా ఉంటుంది. టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. కొత్త సమాచారం తెలుసుకుంటారు.
మకరం
ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మంచి సమయం ఇది. పెట్టుబడి అవకాశాలు అందుకుంటారు. వృద్ధుల ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఎక్కువ పనిభారం తీసుకోకండి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. నిర్ణయం తీసుకునే విషయంలో తొందరపాటు వద్దు. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. పనిని వాయిదా వేయవద్దు.
Also Read: https://telugu.abplive.com/astro/astrology-news-these-zodiac-signs-people-are-very-tuff-and-they-don-t-accept-others-views-306/amp
కుంభం
ఈ రోజు అనవసరమైన ఖర్చులను నివారించండి. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణాన్ని ఉంచడానికి ప్రయత్నించండి. కొన్ని కారణాల వల్ల ఆఫీసులో టెన్షన్ పెరుగుతుంది. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. ధన లాభం ఉంటుంది. కుటుంబ సహాయంతో ఏ పనిలోనైనా ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.
మీనం
ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ప్రత్యర్థులకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామితో మధురానుభూతి ఉంటుంది. సహోద్యోగులు ఆఫీసులో సహాయం చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ రోజు సాధారణంగా ఉంటుంది. రిస్క్ తీసుకోవడం మానుకోండి.
Also Read: https://telugu.abplive.com/astro/horoscope-for-you-know-your-star-what-is-rashi-based-first-letter-of-your-name-172/amp