మన నిత్యజీవితంలో విభిన్న రకాల మనుషులను చూస్తుంటాం. ఏ ఇద్దరి ప్రవర్తన ఒకేలా ఉండడం చూసి ఉండం. కొందరు మృధుస్వభావంతో ఉంటారు. మరికొందరు పరుషంగా మాట్లాడతారు. ఇంకొందరు సర్దుకుపోయే మనస్తత్వంతో ఉంటారు. వారు పుట్టిన నక్షత్రం, రాశి, గ్రహసంచారం ఆధారంగానే ఇలా ప్రవర్తిస్తారని చెబుతారు జ్యోతిష్య పండితులు. అయితే కొన్ని రాశుల వారు మాత్రం చాలా మొండిగా ప్రవర్తిస్తారట. తాము పట్టిన కుందేలుకి మూడేకాళ్లు అన్న ధోరణి తప్ప…ఎదుటివారి అభిప్రాయాన్ని అస్సలు పరిగణలోకి తీసుకోరు. అలాంటి రాశులేంటో ఇప్పుడు చూద్దాం…




మేషం: మేషరాశివారు చాలా తెలివైనవారు.తమకు తెలియనిది లేదనే గర్వంతో ఉంటారట. వారు చేయాలనుకున్నదే చేస్తారు. వారు చెప్పినదే కరెక్ట్ అని భావిస్తారు. ఎవరైనా తాము చెప్పినదానికి అడ్డం వస్తే అస్సలు భరించలేరు. కోపగించుకోవడమే కాదు…తమ అభిప్రాయం చెప్పిన వారితో వాదనకు దిగుతారట.




సింహం: సింహరాశి వారు స్వతంత్ర స్వభావం కలిగి ఉంటారు. వారికి ఏదైనా నచ్చకపోతే..అక్కడితో వదిలేయరు. వాగ్వాదానికి దిగుతారు. ఎదుటివారు చెప్పింది అస్సలు వినరు. పోనీ ఎవరైనా ఒప్పించేందుకు ప్రయత్నిస్తే అహం దెబ్బతిన్నట్టు భావిస్తారు. తమకు చులకన చేస్తున్నారనే ఆలోచనతో అహం దెబ్బతిని తగాదాకు కూడా దిగుతారు. సింహరాశివారితో గొడవ పడి గెలవడం కష్టమే.




తుల: తులరాశివారు నిశ్చల స్వభావం కలిగినవారు. త్రాసులా సమానంగా తూగుతారు. తమ గురించి ఆలోచించుకుంటారు…ఇతరుల గురించి కూడా బాగా ఆలోచిస్తారు. ఇంతవరకూ బాగానే ఉన్నా….కోపం వచ్చిందంటే చాలు వీళ్లు వాస్తవ స్వభావాన్ని కోల్పోతారు. ఎదుటవ్యక్తి తమ గురించి ఏం అనుకుంటారనే అలోచన లేకుండా...వాదన మొదలుపెడతారు. ఆ సమయంలో వీళ్లు చెప్పినది అంగీకరించడం మినహా మరో ఆప్షన్ ఉండదు. ఎదురుచెప్పినా భరించలేరు.




కుంభం: కుంభం రాశివారు తమ జీవితంలో చాలా కష్టపడతారు. ఇంట గెలిచి రచ్చగెలవాలని అంటారు కానీ.. కుంభరాశి వారుమాత్రం ఇంట్లో కన్నా బయటే ఎక్కువ గౌరవ మర్యాదలు పొందుతారు. వాళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం పొందడమే కాదు..పరువు ప్రతిష్టలు సంపాదించుకుంటారు.అందుకే వీరిలో కొంచెం ఆధిపత్య భావన కలుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏమైనా తమ మాటను వ్యతిరేకిస్తే చికాకుపడతారు. ఎదుటి వారి అభిప్రాయం తప్పు అని…తాము తీసుకున్న నిర్ణయమే సరైనదని వాదిస్తారు. పైగా కుంభరాశివారు కోపంగా ఉన్నప్పుడు ఏం చెప్పినా అర్థం చేసుకోరు. కానీ కోపం తగ్గాక మాత్రం ఏతి తప్పు…ఏది రైటు అనే విషయాన్ని సరిగ్గా అంచనా వేస్తారు.


గమనిక: రాశిఫలాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…