ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్. ఎక్కడ విన్నా ఇదే మాట. ఏ ఇద్దరు తల్లిదండ్రులు మాట్లాడుకున్నా మా పిల్లలు ఇంత షార్ప్ గా ఉన్నారంటే…మా పిల్లలు అంతకుమించి అంటున్నారు. వాస్తవానికి ఈ జనరేషన్ పిల్లలంతా తెలివైనవాళ్లే. ఏదీ ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరు ఒక్కోలాగాప్రవర్తిస్తుంటారు. అయితే వీరిలో అందరి ఇష్టాలు ఒకేలా ఉండవు. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ దాగి ఉంటుంది. మరి ఏ రాశిలో పుట్టిన పిల్లలు తెలివైనా వారు…ఎవరిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయ్…ఎవరిలో క్రియేటివిటీ ఎక్కువ…ఏ రాశిలో పుట్టిన పిల్లల్లో ఎలాంటి ప్రత్యేకతలుంటాయ్.
మేషరాశిలో పుట్టిన పిల్లల్లో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఎంత విపత్కర పరిస్థితుల్లో అయినా అలవోకగా నిర్ణయం తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. కేవలం వీరి సమస్యలను పరిష్కరించుకోవడం మాత్రమే కాదు…ఎదుటివారెవరైనా సమస్యల్లో ఉంటే వెంటనే స్పందించడంలోనూ మేషరాశి పిల్లలు ముందుంటారు.
వృషభ రాశిలో పుట్టిన పిల్లలకు పట్టుదల ఎక్కువ. అందరికీ సాధారణంగా కనిపిస్తారు…ఏదోలే అన్నట్టుంటారు. కానీ ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఎదుగుతారు. పైగా ఓ టార్గెట్ పెట్టుకుంటే కచ్చితంగా రీచ్ అవుతారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వీరిలో సంకల్ప బలం చాలా ధృడంగా ఉంటుంది. అందుకే అనుకున్న పనిని కచ్చితంగా సాధిస్తారు…
మిథున రాశిలో జన్మించిన పిల్లల్లో క్రియేటివిటీ ఎక్కువ. మాంచి మాటకారులు కూడా. ఎదుటివారిని మాటలతో ఇట్టే కట్టిపడేస్తారు. సృజనాత్మక ఆలోచనలు కలిగిఉంటారు. ఏ పని చేయడంలో అయినా వీరి రూటే సెపరేటు. వయసు చిన్నదే అయినా ఆలోచనలు మాత్రం చాలా పెద్దవి.
కర్కాటక రాశి పిల్లలు ఎదుటి వారి భావాలకు ఎక్కువ విలువనిస్తారు. తమకో ఆలోచన ఉన్నప్పటికీ ఎదుటివారి కంఫర్ట్ ని ఆలోచించి నడుచుకుంటారు. ఎంత కఠినమైన వ్యక్తిని అయినా అర్థం చేసుకునే నైపుణ్యం వీరిసొంతం. మరీ ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించిన పిల్లలు ఏ విషయాన్ని అస్సలు దాచుకోలేరు. వీరికి ఓ విషయం తెలిసిందంటే…వెంటనే ఎవరో ఒకరికి చేరవేసేస్తారు….
అఢవికి రాజు సింహం….అలాగే సింహ రాశిలో పుట్టిన పిల్లలు కూడా ఈ కోవకే చెందుతారు. వారి వారి సామ్రాజ్యంలో వాళ్లే యువరాజులు. వీరిలో నాయకత్వ లక్షణాలకు కొదవే ఉండదు. సింహరాశిలో పుట్టిన పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. నూటికొకరు ఉంటారని చెబుతున్నట్టే…వీరి ప్రవర్తన కూడా వంద మందిలో ప్రత్యేకంగా ఉంటుంది. అంతులేని శక్తి సామర్థ్యాలు కలిగిఉంటారు. ఒకపని అనుకుంటే…భయపెట్టో బతిమిలాడో చేయించుకునే నేర్పు కలిగి ఉంటారు.
కన్యారాశిలో జన్మించిన పిల్లల్లో ఖచ్చితత్వం ఎక్కువ. ప్రతి విషయం చాలా పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు. చిన్నప్పటి నుంచీ అన్ని పనుల్లోనూ చాలా నియమబద్దంగా వ్యవహరిస్తారు. ఆటల్లో, చదువులో అన్నింటిలోనూ వీరిదే ప్రధమ స్థానం…
తులారాశి పిల్లల్లో…. త్రాసులు సమానంగా తూగుతాయన్నట్టు సహనం, ఓర్పు అన్నీ సమానంగా ఉంటాయ్. ఎవరితో ఎలా ప్రవర్తించాలి…ఎవర్ని ఎలా ఇంప్రెస్ చేయాలి…ఎవరి వల్ల తమపని పూర్తవుతుందనే విషయాలపై వీరికి చాలా క్లారిటీ ఉంటుంది. ముఖ్యంగా ఇతరులతో తమ పనులు పూర్తిచేయించుకోవడంలో వీరు నేర్పరులు.
వృశ్చిక రాశిలో పుట్టిన పిల్లలు ఏదైనా అనుకుంటే చాలు…గోల్ రీచ్ అయ్యేవరకూ కష్టపడతారు. ఏ పని చేసినా మొక్కుబడి అనే మాటే ఉండదు…ఫుల్ ఫోకస్ పెడతారు. అన్ని రంగాల్లో రాణించగల నైపుణ్యం వీరి సొంతం. వీరి అభిరుచులు చాలా ప్రత్యేకంగా ఉంటాయ్.
ధనుస్సు రాసిలో పుట్టిన పిల్లలు ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉంటారు. ఎంత కష్టాన్ని అయినా ఇష్టంగా మార్చుకోవడంలో వీళ్లకి వీళ్లే సాటి. ముఖ్యంగా సమస్య పెద్దది అయినా..చిన్నది అయినా …చివరికి అసాధ్యమైనది అయినా..గట్టి సంకల్పంతో పూర్తి చేస్తారు…
మకర రాశిలో జన్మించిన పిల్లల్లో మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువ. చిన్నప్పుడే ఎక్కువ తెలుసుకుంటారు. ఏ పని చేయాలి…ఆ పని వల్ల వచ్చే లాభం ఏంటి..నష్టం ఏంటి బేరీజు వేసుకుంటారు. లాభం అయితే ముందడుగు వేస్తారు. నష్టం అని అనిపించినా, వృధా అనే ఆలోచన వచ్చినా అస్సలు అటువైపు పోనేపోరు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి విషయాన్ని ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు…
కుంభ రాశిలో పుట్టిన పిల్లలకు క్రియేటివిటీ ఎక్కువ. సమస్యలను నుంచి ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసు. కొత్త కొత్త అంశాలను వెలుగులోకి తేవడానికి ప్రయత్నిస్తారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు.
మీనా రాశిలో జన్మించిన పిల్లలు వండర్ ఫుల్ కిడ్స్ అనే చెప్పాలి. ఇతరుల సమస్యలను వారి బాగోగులను చూసుకుంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా…ఎవ్వరు ఏం చెప్పినా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
Children zodiac: మీ పిల్లలు ఈ రాశుల్లో పుట్టారా?...అయితే చాలా తెలివైన వాళ్లు…
ABP Desam
Updated at:
16 Jul 2021 10:32 AM (IST)
ఏ రాశిలో పుట్టిన పిల్లలు తెలివైనా వారు…? ఎవరిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయ్…? ఎవరిలో క్రియేటివిటీ ఎక్కువ…? ఏ రాశిలో పుట్టిన పిల్లల్లో ఎలాంటి ప్రత్యేకతలుంటాయ్..?
Astro_3
NEXT
PREV
Published at:
08 Jul 2021 08:46 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -