జూలై నెల ఈ రాశి వారికి అంతా అనుకూలమే
అప్పుడే ఏడాదిలో సగం రోజులు గడిచిపోయాయ్. నిన్నటి వరకూ అన్ని విధాలుగా కాలం కలిసొచ్చిన వాళ్లంతా మిగిలిన ఆరు నెలలు అలాగే గడవాలని కోరుకుంటే….నిన్నటి వరకూ పెద్దగా కలసిరానివారు…ఇకముందు కాలమైనా బావుండాలని కోరుకుంటున్నారు. మరి ఈ నెలలో ఏ రాశివారికి బావుంది… జోతిష్య శాస్త్రంలో అపారమైన అనుభవం ఉన్న పండితులు ఏం చెబుతున్నారో చూద్దామా…మేషం మేషరాశి వారికి ఈ నెలలో గ్రహసంచారం అనుకూలంగా ఉంది. గడిచిన నెలవరకూ ఎదుర్కొన్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సరైన సమయానికి డబ్బు చేతికందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికమైనప్పటికీ…తగిన గుర్తింపు లభిస్తుంది. లాయర్లకు, డాక్టర్లకు ఈ నెలంతా అనుకూల సమయమే. ఇంజనీర్లకు, డాక్టర్లకు, ఐ.టి నిపుణులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారులు, స్వయం ఉపాధివారు పురోగతి సాధిస్తారు. కోర్టు కేసుల్లో చిక్కుకున్న వారికి అనుకూలంగా వచ్చే సూచనలున్నాయ్. సొంత నిర్ణయాల కన్నా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. మిథునంఈ రాశివారికి ఈ నెల ప్రశాంతంగానే గడిచిపోతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందడంతో కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్, అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహకాలు ఉండే అవకాశం ఉంది. అయితే అష్టమ శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నా, తలచిన పనుల్లో కొన్నింటిని పట్టుదలతో పూర్తి చేస్తారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యుల సహాయంతో బయటపడతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సైన్స్, ఐ.టి విద్యార్థులు రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వ్యాపార రంగంలో లాభాలకు అవకాశం ఉంది.
సింహం ఈ రాశివారికి ఈ నెలంతా హాయిగా, ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ లక్ష్యాలు పూర్తి చేస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇల్లుగానీ, స్థలం గానీ కొనాలని ప్రయత్నిస్తారు. తలపెట్టిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు సత్ఫలితాలు సాధిస్తారు.