భారత్ X ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇంకా  245 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 126.1 ఓవర్లలో 364 పరుగులకి ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలన్ జేమ్స్ అండర్సన్ 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 











అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 276/3తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టును రెండో రోజు ఆదిలోనే దెబ్బ తీసింది ఇంగ్లాండ్.  ఓపెనర్ కేఎల్ రాహుల్ (129: 250 బంతుల్లో 12x4, 1x6) రెండో బంతికే ఓలీ రాబిన్సన్ బౌలింగ్‌లో ఔటైపోయాడు. ఆ తర్వాతి ఓవర్లోనే రహానె కూడా ఔటయ్యాడు. రహానె (1, 23 బంతుల్లో) ఈ రోజు ఒక్క పరుగు కూడా సాధించలేదు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పంత్ కాసేపు జడేజాతో కలిసి స్కోరు బోర్డును కదిలించాడు. ఈ క్రమంలోనే భారత స్కోరు బోర్డు 300 మార్కును అందుకుంది. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో కట్ షాట్ ఆడబోయి పంత్ (37: 58 బంతుల్లో 5x4) ఔటయ్యాడు. రవీంద్ర జడేజా (40: 120 బంతుల్లో 3x4)ఒంటరి పోరాటం చేశాడు.


AlsoRead: Unmukt Chand Retirement: టీమిండియా తరఫున ఆడకుండానే... రిటైర్మెంట్ ప్రకటించిన 28 ఏళ్ల ఉన్ముక్త్ చంద్


కానీ, అతనికి మద్దతుగా ఎవరూ క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేదు. షమి, బుమ్రా పరుగుల ఖాతా తెరవకుండానే  వెనుదిరిగారు. రహానె(1), పుజారా (9) ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. రోహిత్ శర్మ (83), విరాట్ కోహ్లీ(42) మంచి స్కోర్లు సాధించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 5 వికెట్లు పడగొట్టగా.. ఓలీ రాబిన్సన్, మార్క్‌వుడ్‌‌ చెరో రెండు వికెట్లు, మొయిన్ అలీకి ఒక వికెట్ దక్కింది.


AlsoRead: IPL 2021: UAE బయల్దేరిన ధోనీ సేన... మొదలైన IPL సందడి... చెన్నై సూపర్ కింగ్స్ ఫొటోలు వైరల్