Venkatesh Saindhav movie distribution rights in Telugu States: విక్టరీ వెంకటేష్ సినిమా ప్రయాణంలో 'సైంధవ్' ఓ మైలురాయి. హీరోగా ఆయనకు 75వ చిత్రమిది. సంక్రాంతి పండక్కి విడుదల అవుతోంది. ఈ శనివారం (జనవరి 13న) తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.
'సైంధవ్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? సినిమాను ఎన్ని కోట్లకు అమ్మారు? ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తే సినిమా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వస్తాయి? అనేది చూస్తే...
- నైజాం (తెలంగాణ) - రూ. 7 కోట్లు
- సీడెడ్ (రాయలసీమ) - రూ. 3 కోట్లు
- ఆంధ్ర (అన్ని ఏరియాలు కలిపి) - రూ. 9 కోట్లు
- ఏపీ, టీజీ... రెండు తెలుగు రాష్ట్రాల్లో - రూ. 19 కోట్లు
- కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా - రూ. 2 కోట్లు
- ఓవర్సీస్ - రూ. 4 కోట్లు
- టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ - రూ. 25 కోట్లు
'సైంధవ్' సినిమాకు రూ. 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే డీసెంట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సుమారు రూ. 26 లేదా 27 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వస్తాయి. 'సైంధవ్'ను కొన్ని ఏరియాలలో వెంకటేష్ సోదరుడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సినిమాకు ఉన్న బజ్ చూస్తుంటే... హిట్ టాక్ వస్తే పాతిక కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు.
Also Read: క్రేజ్ ఎక్కువ, బిజినెస్ తక్కువే - 'హనుమాన్'ను ఎన్ని కోట్లకు అమ్మారంటే?
'సైంధవ్' సినిమాలో వెంకటేష్ సరసన 'జెర్సీ' ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. వెంకీ భార్యగా, ఓ పాపకు తల్లిగా మనోజ్ఞ క్యారెక్టర్ చేశారామె. అభినయానికి ఆస్కారమున్న పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ నటించినట్లు దర్శక - నిర్మాతలు తెలిపారు. మూడేళ్ల విరామం తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ నటించిన తెలుగు చిత్రమిది. ఆమె కాకుండా సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. సుశాంత్ 'చిలసౌ', విశ్వక్ సేన్ 'హిట్' సినిమాల ఫేమ్ రుహానీ శర్మ డాక్టర్ రోల్ చేశారు. ఆమె పాటు ఆండ్రియా జెరెమియా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.
ప్రతినాయకుడిగా నవాజుద్ధీన్ సిద్ధిఖీ
'సైంధవ్' సినిమాతో ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సినిమాలో ఆయన విలన్ రోల్ చేశారు. ముఖేష్ రుషితో పాటు ఆయన నటించిన సన్నివేశాలు టీజర్‌లో వైరల్ అయ్యాయి. తమిళ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన ఆర్య మానస్ పాత్రలో యాక్ట్ చేశారు. సినిమాలోని ఎనిమిది కీలక పాత్రల్లో ఆయనది ఓ పాత్ర అని చెప్పారు.